ఆకాశంలో వెల్లివిరిసిన ఇంద్రచాపం మన మధ్య అనుబంధానికి సాక్ష్యమైతే నా ఎదలో నీ ముగ్ధ మనోహరరూపం నీపై నాకున్న ప్రేమకి సాక్ష్యం నీ నవ్వులో నాకు కనిపించే వెన్నెల వర్షం మన మధ్య ఆత్మీయతకి సాక్ష్యమైతే అనుక్షణం నా మనసుకు వినిపించే నీ సవ్వడులే నీపై నాకున్న అనురాగానికి సాక్ష్యం కాలం నుండి విడదీయలేని ఈ క్షణంలో విడిపోయిన మన అడుగులు ఏకమవ్వాలని ఆకాంక్షిస్తూ.... నీ జీవనసంద్రంలో ఒక అలగా మిగిలిపోయే

మరింత సమాచారం తెలుసుకోండి: