గజిబిజి పరుగులతో అర్ధంకాని ఆలోచనలతో నడిచిపోయే నా ఈ జీవనప్రయాణంలో ఎన్నో ఆనందాల కలలు ఎన్నో విషాదాల అలలు ఎన్నెన్నో అభినందనీయ సంఘటనలు ఎన్నెన్నో విశ్వసనీయ ప్రకటనలు అవతారపురుషుడిలా ఏదో సాధించాలన్న తపనతో ఆలోచించిన క్షణాలు కొన్ని ఆధునిక యువకుడిలా రెక్కలుకట్టుకు ఎగరాలన్న ఆలొచనతో నడిచిన క్షణాలు కొన్ని అప్రమత్తంగా ఒక యోధుడిలా సాగిపోవాలన్న భావనతో గడిచిపోయిన క్షణాలు కొన్ని కాని నన్ను నన్నుగా ఇలా చిరంజీవిగా మిగిల్చివేసిన క్షణాలే అన్ని..... ప్రేమే లేదని భావించి ఎందరి హృదయాల్నో గాయపరచిన తరుణాలు కొన్ని నాకే తెలీకుండా ప్రేమ అనే మధుర భావంతో సాగించిన ప్రయాణాలు కొన్ని ఎవరికీ దూరం కానని, అందరి దరిలో నదిలా ప్రవహించాలని చేసుకున్న ప్రమాణాలు కొన్ని కాని ఈనాడు నా జీవితగమనంలో నా ప్రతిరూపమే నాకు దూరమైన గ్రహణాలే అన్ని....

మరింత సమాచారం తెలుసుకోండి: