పవన్ కల్యాణ్ కు సినీ పరిశ్రమ నుంచి సపోర్ట్ వచ్చే చాన్సే లేదని తెలుస్తోంది. మొన్నటి దాకా పవన్ పై ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ...నిన్నటికి నిన్న పవన్ పుస్తకంపై విమర్శలు చేశారు. ఇక తాజాగా మరో డైరెక్టర్ కూడా పవన్ కు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు. సినీ గ్లామర్ రాజకీయాల్లో వర్కవుట్ కాదని అన్నారు.. ఈసారి ఎన్నికల కోసం ఎన్నడూ లేనంతగా సినీ తారలంతా పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ హీర్ పవన్ కల్యాణ్ నుంచీ కమెడియన్ వేణుమాధవ్ వరకు ఎంతో మంది రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. తమకున్న క్రేజ్ ను ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఐతే సినీ గ్లామర్ ఎన్నికల్లో పనిచేయదని...పవన్ కల్యాన్ లాంటి వాళ్లు ఏమాత్రం ప్రభావం చూపలేరని అంటున్నారు. ఐతే ఈ మాటలు అన్నది ఎవరో కాదు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు ప్రస్తావించారు. ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని...అన్ని పార్టీలు అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయన్నారు. సినిమాలు , రాజకీయాలు వేరని..ఎన్నికల్లో సినీ గ్లామర్ పనిచేస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. గ్లామర్ కంటే వ్యక్తి ప్రధానమని చెప్పారు. ఎన్టీఆర్ కంటే ముందు చాలా మంది యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చినా...అధికారంలోకి రాలేకపోయారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ హయాంలో గ్రామగ్రామాలకు తిరిగి స్వచ్ఛమైన అభ్యర్థులను ఎంపిక చేశారని తమ్మారెడ్డి తెలిపారు. ఐతే ఇప్పుడు అటువంటి వాతావరణమే కనిపించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికల్లోకి రాకుండా పరోక్షంగా ఏదో చేయాలనుకుంటే లాభం ఉండదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. మోడీకి మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే మోడీకి దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉందని...పవన్ మద్దతు ప్రకటించడం వల్ల మోడీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. మొత్తానికి నిన్న వర్మ...ఇవాళ తమ్మారెడ్డి....ఇలా సినీ పరిశ్రమకు చెందిన వాళ్లే పవన్ పై పూర్తి నమ్మకం పెట్టలేకపోతున్నారు, ఇక సామాన్యులు పవన్ ను ఎంత వరకు నమ్ముతారనేది వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: