పార్టీల జాబిజా వెల్లడి పూర్తవుతుంటే... రోజులకు రోజుకు కసరత్తు చేసి చంద్రబాబు చాలా తక్కువమంది పేర్లు ప్రకటించారు. అయితే ఇది వ్యూహమా. లేదంటే నిజంగానే కసరత్తు అక్కడిదాకే వచ్చిందా?. రీజన్‌ రెండోది అయితే ఫర్వాలేదు. కానీ, వ్యూహమైతే మాత్రం, అదే చంద్రబాబును దెబ్బకొట్టబోతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు విడుదల లిస్ట్‌లో నల్గొండ జిల్లా నుంచి దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, సూర్యాపేట, భువనగిరి అభ్యర్థుల పేర్లున్నాయి. వీరిలో హుజూర్‌నగర్‌, సూర్యాపేట అభ్యర్థులు వంగాల స్వామిగౌడ్, పటేల్ రమేష్ రెడ్డిలు మోత్కుపల్లి వర్గానికి చెందిన వారే... దీనిపై పార్టీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి మండిపడుతున్నారు. మోత్కుపల్లి వర్గీయులకు పెద్ద పీట వేయడమే కాకుండా.. తాను చెప్పిన విధంగా కోదాడ టిక్కెట్‌ను సిట్టింగ్ చందర్‌రావుకు ఇచ్చేందుకు బాబు నిరాకరిస్తున్నారనేది ఉమా మాధవరెడ్డి వాదన. కొన్నాళ్ల క్రితం TDPలో చేరిన మల్లయ్య యాదవ్‌కు కోదాడ టిక్కెట్ ఇస్తున్నారనేది ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న ప్రచారం. అదే జరిగితే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్దమంటున్నారు ఉమా మాధవరెడ్డి. ఇక ఖమ్మం జిల్లా పాలేరు పంచాయతీ అలాగే నడుస్తోంది... తుమ్మల-నామా మధ్య ఇప్పటికీ పొసగడం లేదు... పాలేరు సీటు ఇవ్వాలంటూ తుమ్మల పట్టుపడుతుంటే... తానే పార్టీ అధ్యక్షుడినైనట్లు పాలేరు ఆయనకి ఇవ్వవద్దని అడ్డం పడుతున్నారు నామా... ఈ వ్యవహరంలో తన మాట నెగ్గకుంటే పార్టీని వీడేందుకు సిద్దం అంటున్నారాయన... వీరి పంచాయతీ ఆల్రేడీ బాబు వద్ద పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంపై కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది... మల్కాజ్‌గిరి ఎంపీ స్థానాన్ని తనకివ్వాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు రేవంత్ రెడ్డి.. మూడేళ్ల నుంచి ఆ దిశగా గ్రౌండ్‌వర్క్‌ కూడా చేసుకుంటున్నారాయన.. దానికి సంబంధించి పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.... ఈ స్థానాన్ని మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత మల్లారెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దపడ్డారన్న ప్రచారం ఊపందుకుంది... దీంతో పార్టీపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేకుండా మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు సిద్దమవుతున్నారు రేవంత్... అప్పటికీ చంద్రబాబు దిగి రాకుంటే మల్లారెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగానే ప్రచారం చేసే ఆలోచన కూడా చేస్తున్నారు ఆ క్రమంలో పొత్తుల వ్యవవహరమే బాబుకు కత్తుల్లా గుచ్చుకుంటుంటే.. ఇప్పుడు టిక్కెట్ల పంచాయతీ పక్కలో బల్లెంలా మారుతోన్నట్టు కన్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: