'ప్రేమ అనే రెండు అక్షరాల బంధంతో కులం, మతం, పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఒక్కటై అనేక మంది ఆదర్శంగా జీవిస్తున్నారు. మరో పక్క ప్రేమ అనే ఆయుధాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారు. ప్రేమ పేరుతో వెంటపడుతున్నారు. అమాయక అమ్మాయిలను వంచించి వారి కోరిక తీరాక అతి కిరాతకంగా హత్యలు, సజీవ దహనాలు చేస్తున్నారు.' కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణలో 14 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యే ఇందుకు నిదర్శనం. ఈ దుర్ఘటనపై ప్రజాశక్తి ఈ వారం ప్రత్యేక కథనం... కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో హైమావతి యాకోబుల కుమార్తె మార్తమ్మ(14). అదే గ్రామానికే చెందిన పౌలు, జయమ్మల కుమారుడ యోహాను జులాయిగా తిరుగుతుండేవాడు. పనుల కోసం ముంబాయి, బెంగుళూరు లాంటి ప్రాంతాల్లో వలస వెళ్లిన చోటా కూడా గొడవలు పడి గ్రామానికి తిరిగి వస్తుండేవాడు. అమ్మాయిల వెంటపడి లోబరు చుకునేవాడు. ఈ క్రమంలో స్వగ్రామంలోనే ఉన్న మార్తమ్మను ప్రేమ పేరుతో వెంటపడి మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు. తన కోరికలు తీరాక ఆమెను వదిలేసే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంత్రాలయం పోలీస్‌ స్టేషన్‌లో తమ కూతురుకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు కేసు నమోదు చేయకుండా తప్పు జరిగింది కనుక పెళ్లి చేసుకునే విధంగా పెద్దమనుషులతో పంచాయితీ చేసి పరిష్కరించుకోమని ఇద్దరికీ సర్ధిచెప్పారు. చిలకలడోణ గ్రామంలోనే మార్తమ్మను యోహాను పెళ్లి చేసుకునే విధంగా నిర్ణయించారు. మార్తమ్మను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని యోహాను తన తల్లితండ్రులు మేనమామలు, చిన్నమ్మలతో చంపాలని పథకం పన్నాడు. పెళ్లి పేరుతో మార్తమ్మకు మరింత దగ్గరయ్యాడు. ఫిబ్రవరి 20న మార్తమ్మకు యోహాను ఫోన్‌ చేసి ఈ రోజు నీతో ప్రత్యేకంగా మాట్లాడాల్సి వుందని ఫోన్‌ స్విచ్‌ ఆప్‌ చేసుకోవద్దని ఉదయం నుంచి నాలుగైదు సార్లు ఫోన్‌ చేసి చెప్పాడు. అదేరోజు గ్రామంలో వేరే పెళ్లి తంతు జరుగుతున్న సందర్భంలో రాత్రి 8 గంటలకు మార్తమ్మకు ఫోన్‌ చేసి బయటకు రావాలని మాయ మాటలు చెప్పాడు. యోహాను మాటలు నమ్మిన మర్తమ్మ చిలకలడోణకు 2 కి.మీ దూరంలో వున్న బూదూర్‌ రోడ్‌ వరకు వెళ్లింది. మోహన్‌ తన మేనమామలు రాజు, బాబులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం యోహాను చిన్నమ్మ పద్మావతి, తన తల్లి దండ్రులతో కలిసి మార్తమ్మకు వైరుతో గొంతుకు బిగించి హత్య చేశారు. తర్వాత ఆమె కాళ్లకు ఉన్న 40 తులాల వెండి కడియాలను పట్టుకార్లతో తీసుకున్నారు. అనంతరం పక్కనే వున్న మోరీలో ఆమెను పడేసి గడ్డివేసి గుర్తు పట్టకుండా నిప్పంటించారు. ఓ నిర్భాగ్యురాలు హత్య సంఘటన గ్రామంతో పాటు మండలం మొత్తం కంటతడి పెట్టించింది. యోహాను గతంలో బెంగుళూరు, ముంబరులో ఇదే మాదిరిగా అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి దేహశుద్ధి చేయించుకుని పారిపోయి వచ్చాడు. గత కేసు ద్వారా విచారణ చేస్తే ఈ విషయ బయటకి వచ్చింది. మార్తమ్మను కోడలుగా స్వీకరిచండం ఇష్టం లేని యోహాను తల్లిదండ్రులు, మామలు, పథకం వేసి సామూహిక అత్యాచారం, హత్య చేశారని మార్తమ్మ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: