లెక్కపెట్టలేని ఆకాశంలో చుక్కలు జీవితంలో అడుగడుగున ఎదురయ్యే చిక్కులు షరామాములే పక్షులకు చలనం, మనుషులకు జననం అలాగే మరణం షరామాములే ప్రేమలో వేదన, మనసుకు తపన దేవుని పూజలో ఆరాధన షరామాములే ఒకరోజులో రేయిపగలు, రాజకీయాల్లో పగలు అగ్నిపర్వతాల్లో ఎగసే మంటలసెగలు షరామాములే లోకంలో ఎన్నో ప్రేమగాధలు జీవితంలో సుఖాలతో పాటు బాధలు షరామాములే రైతుల జీవితాల్లో రుణాలు బ్రతుకు కోసం అణాలు షరామాములే గమ్యంలేని పయనాలు ఎదురుచూపులు చూసే నయనాలు షరామాములే అమ్మ ప్రేమ, కోరుకున్న ప్రేయసి ప్రేమ షరామాములే అయినా విలువకట్టలేని విలువైన గనులు

మరింత సమాచారం తెలుసుకోండి: