మరి బేషరతుగా మద్దతు ప్రకటించాడని తక్కువ అంచనా వేస్తున్నారో ఏమో కానీ పవన్ కల్యాణ్ పై విమర్శల వాన ను మొదలుపెట్టారు తెలుగుదేశం నేతలు. పవన్ కల్యాన్ తెలుగుదేశానికి మద్దతునిస్తున్నాడనే విషయాన్ని తెలిసి కూడా పవన్ ఒక స్కామ్ స్టర్ కు అండగా నిలస్తున్నాడని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ ఒక అవినీతి పరుడికి అండగా నిలబడుతున్నాడనివారు విమర్శిస్తున్నారు. దీన్ని సహించమని స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకించి విజయవాడ ఎంపీ సీటు విషయంలో పవన్ కల్యాణ్ పాత్రపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. పవన్ కల్యాణ్ మద్దతు ఉన్న పొట్టూరి వరప్రసాద్ కు ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని పవన్ లాబీయింగ్ చేసి తన సన్నిహితుడికి టికెట్ ను ఇప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. పవన్ లాబీయింగ్్ధాటికి మూడేళ్లుగా ఇక్కడ పనిచేసుకొంటున్న కేశినేని నానికి ఎసరు వచ్చిందని, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టుకొన్న ఆయనకు నిరాశ తప్పడం లేదని వార్తలు వస్తున్నాయి. విజయవాడ ఎంపీ సీటును ఎంతోమంది అడిగినా వారికి కేశినేని పేరును చెప్పి తప్పించుకొన్నాడు చంద్రబాబు నాయుడు. పీవీపీ కూడా మొదట సొంతంగా వచ్చి విజయవాడ ఎంపీ సీటు విషయంలో బాబుకు విజ్ఞప్తి చేసుకొన్నాడు. అప్పుడుకూడా బాబు కేశినేని నానికే టికెట్ కేటాయిస్తామని పీవీపీకి స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు మాత్రం విజయవాడ సీటు పీవీపీకి దాదాపు ఖాయం అయినట్టేనని తెలుస్తోంది. కేశినేని ని పెనమలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయమని బాబు సూచించినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా కేశినేని వర్గం ఫైరయ్యింది. పవన్ కల్యాణ్ వల్ల టికెట్ చేజారుతోందని ఫీలవుతున్న వాళ్లు పవన్ ను టార్గెట్ గా చేసుకొన్నారు వాళ్లు. పవన్ ఒక స్కామ్ స్టర్ సపోర్ట్ చేస్తున్నాడని కేశినేని వర్గం విమర్శిస్తోంది. మరి తెలుగుదేశం పార్టీ వైపు నుంచినే ఇలాంటి విమర్శలు వస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఇబ్బందిలో పడిపోయారు. మద్దతు ప్రకటిస్తున్నా కూడా టీడీపీ నేతలు పవన్ ను స్కామ్ స్టర్ కు సపోర్టర్ గా అభివర్ణించడం పై వారు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: