పవన్ కల్యాణ్ "జనసేన'' పార్టీ ప్రారంభించి భారీ ఎత్తున సభలు ఏర్పాటు చేసి తన విధి విధానాలు ప్రకటించాడు. అదే సమయంలో తన అభిమాన నేతల గురించి కూడా ఆ సభల నుంచే ప్రకటన చేశాడు పవన్ కల్యాన్. అలా పవన్ తన అభిమాన నేతగా ప్రకటించిన వారిలో జగ్గారెడ్డి ముఖ్యుడు. తెలంగాణ ప్రాంతంలో తనకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అంటే చాలా ఇష్టమని పవన్ ప్రకటించాడు. మరి జగ్గారెడ్డి కేసీఆర్ కు వ్యతిరేకి అనే ఆ మాట మాట్లాడి ఉంటాడు పవన్ కల్యాణ్. అయితే అలా మాట్లాడితే ఎంత ప్రమాదమో ఇప్పడిప్పుడే పవన్ కల్యాణ్ కు అర్థమవుతోంది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జగ్గారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఆయన అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక గెస్ట్ హౌస్ లో సెల్ ఫోన్లను, ఇతర వస్తువులను పంచడం గురించి ప్రణాళిక రచిస్తూ జగ్గారెడ్డి అండ్ బ్యాచ్ దొరికిపోయింది. మీడియా విజువల్స్ లో జగ్గారెడ్డి, జేఏసీ నేత గజ్జెల కాం తంలు కనిపించారు. దీంతో వారు గెలవడానికి ఎలాంటి దారులు ఎంచుకొంటున్నారో స్పష్టంగా అర్థం అయ్యింది. మరి ఇప్పుడు జగ్గారెడ్డి అభిమాని అయిన పవన్ కు కూడా ఇబ్బందులు మొదలయ్యాయి. చూడండి పవన్ వాళ్ల ఫేవరెట్ నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నాడో... ఆయన గెలవడానికి ఎలాంటి దారులు ఎంచుకొన్నాడో గమనించండి.... అంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్టులు మార్మోగుతున్నాయి.ఈ విధంగా పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నాడని జగ్గారెడ్డిని పొగిడితే... జగ్గారెడ్డి అసలు స్వరూపం బయట పడటంతో పవన్ కల్యాణ్ పై పంచ్ లు పడుతున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: