తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మరో సర్వే ప్రచారంలోకి వచ్చింది. ఎన్డీటీవీ చేపట్టిన సర్వేలో తెలుగుదేశంపార్టీకి మొత్తంగా 15 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. సీమాంధ్రలోని 25 ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్ల వరకూ దక్కే అవకాశం ఉందని ఎన్టీటీవీ సర్వే అంచనా వేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది ఎంపీ సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ సీటు దక్కే అవకాశం ఉందని ఆ సర్వే అంచనా వేసింది. మరి ఈ సర్వే తెలుగుదేశం నేతల, అభిమానుల మోముపై నవ్వులు పూయిస్తోంది. తమదే విజయం అనే కాన్పిడెన్స్ ను కల్పిస్తోంది. అయితే తెలుగుదేశం అభిమానులను ఒక భయం పట్టి పీడిస్తోంది. ఈ సర్వేల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని వస్తున్నప్పటికీ వారికి గతను భవాలు గుర్తుకొస్తే భయం కలుగుతోంది. వెనుకటికి 2004 ఎన్నికల్లోనూ, 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ జాతీయ మీడియా ఎనలాసిస్ లు ఇదే విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేస్తుందని అప్పట్ల్లో జాతీయ మీడియా లో వార్తలు వచ్చాయి. జాతీయ మీడియా సర్వేల్లో తెలుగుదేశం పార్టీదే హవా అనే అంచనాలు వెల్లడయ్యాయి. అయితే ఆ ఎన్నికల్లో ఫలితాలు అందరూ గమనించే ఉంటారు. జాతీయ టీవీ చానళ్లు ,మీడియా వర్గాలు వేసిన అంచనాలు ఒక్కటీ నిజం కాలేదు. 2004 ఎన్నికల్లో అన్ని చానళ్లూ తెలుగుదేశం పార్టీ గాలి ఉందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డాయి. అయితే వాళ్ల అంచనాలు తలకిందుల అయ్యాయి. అప్పట్లో వైఎస్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక 2009 ఎన్నికల్లో అయితే ఆంధ్రప్రదేశ్ లో మహాకూటమి హవా ఉంటుందని తెలుగుదేశం పార్టీ స్వీప్ చేస్తుందని జాతీయ మీడియా అంచనా వేసింది. రాష్ట్ర మీడియా ఆ సర్వే అంచనాలను ప్రజలకు వివరించింది. అయితే అప్పుడు కూడా సర్వేల అంచనాలు తలకిందుల అయ్యాయి. రాష్ట్రంలో మరోసారి వైఎస్ హయాంలని కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి ఇప్పుడు ముచ్చటగా మూడో సారి జాతీయ మీడియా ఏపీలో తెలుగుదేశం పార్టీదే హవా అంటోంది. సీమాంధ్రలోని 25 సీట్లలో ఆ పార్టీ పది సీట్లను గెలుచుకొంటుందని నేషనల్ మీడియా అంటోంది. మరి సెంటిమెంటల్ గా తీసుకొంటే తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్టే. సర్వేల్లో అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడెప్పుడూ తెలుగుదేశం గెలిచిన దాఖలాలు లేవు మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: