అరవై ఏళ్ళ ఆంధ్రా పాలనలో అణు బాంబుల దాడి అనంతరం హిరోషిమా, నాగసాకి కన్నా ఎక్కువ రెట్లు తెలంగాణ ధ్వంసమైపోయిందని టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యను తోసిపుచ్చమని టిపిసిసి అధినేత పొన్నాల లక్ష్మయ్యను ఆయన సవాల్ చేశారు. మంగళవారం నిజామాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పొన్నాల వచ్చిన పక్షంలో తెలంగాణ వనరులు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతగా విధ్వంసానికి గురైందీ ఆయనకు చూపిస్తానని కేసీఆర్ అన్నారు. "విధ్వంసం ఎక్కడని ఆయన నన్ను ప్రశ్నిస్తున్నారు. అదెక్కడ జరిగిందో ఆయనకు చూపిస్తాను" అని టిఆర్ఎస్ అధినేత తెలిపారు. కాంగ్రెస్ విషయానికి వస్తే తనను తప్పు పట్టడం, తనపై బురద చల్లడమే వారి ఎన్నికల ప్రచారంగా కనిపిస్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు.  "తెలంగాణ ఉద్యోగులు తెలంగాణాలో, ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రాలో పనిచేయాలని నేనంటే దానిలో తప్పేముంది? దీనిపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి రావడానికి "సెటిలర్ల ఓట్లు"పై ఆధారపడుతోందని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ను 'వేరే' గా వ్యాఖ్యానించిన కేసీఆర్ "తెలంగాణ ప్రజల ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయా?" అని ప్రశ్నించారు. మైనార్టీ ఓట్లపై దృష్టి పెడుతున్నట్లుగా తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉందని టిఆర్ఎస్ అధినేత పునరుద్ఘాటించారు. తెలంగాణ లౌకిక రాష్ట్రమని, మతసామరస్యానికి కచ్చితమైన నిదర్శనమని ఆయన అన్నారు. "1920లో తెలంగాణాకు వచ్చిన మహాత్మా గాంధీ సైతం తెలంగాణాను కొనియాడారు. మతతత్వ శక్తులతో మనకెలాంటి పనిలేదు" అని కేసీఆర్ నొక్కి చెప్పారు.  ముస్లింలకు ఉపాధి అవకాశాల్లో 12 శాతం కోటా ఇస్తామని, తనపై అనుమానం వద్దని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేసారు. "ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ మార్గం ఉంటుంది. తమిళనాడు అలాంటి రిజర్వేషన్ ఇచ్చింది. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది" అని టిఆర్ఎస్ అధినేత హామీ ఇచ్చారు. స్థానికులను ఆకట్టుకుంటున్నట్లుగా ఒకప్పుడు జిల్లా తెలంగాణాకు గర్వకారణంగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. "ఆంధ్రుల హయాంలో నిజామాబాద్ వెనక్కి నెట్టివేయబడింది. నిజాంసాగర్ మూడు లక్షల ఎకరాలను సాగుచేసేది. నిజామ్ షుగర్స్ ఒకప్పుడు ఆసియాలో అతి పెద్దదిగా నిలిచింది. ఇవాళ పరిస్థితి అలా లేదు. గత వైభవాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది" అని ఆయన హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: