తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా సీమాంధ్రలో నోటిఫికేషన్ విడుదల కాకముందే అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించాడు. ఇంకా తెలంగాణ రచ్చలు సద్దుమణగకముందే చంద్రబాబు తొలి జాబితాను ప్రకటించాడు. అయితే బాబు వ్యూహాత్మకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల జాబితాను ప్రకటించడంతో పెద్దగా గొడవలేకుండాపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాలుగు అర్ధరాత్రుల్లో నాలుగు జాబితాలను ప్రకటించాడు. మొత్తంగా ఐదు జాబితాలను విడుదల చేశాడు. తాజాగా మంగళవారం రాత్రి ఐదో జాబితా విడుదల అయ్యింది. అయితే ఇప్పటికీ సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారు కావాల్సిన నియోజకవర్గాల సంఖ్య 29. 175 నియోజకవర్గాలున్న సీమాంధ్రలో చంద్రబాబునాయుడు ఇంకా 29 నియోజకవర్గాలపై ఒక అభిప్రాయానికి రాలేదు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థులు కన్ఫర్మ్ కాలేదు. మరి చంద్రబాబు ఈ విషయంలో ఇంతలా ఆలోచించడం ఒకింత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో బాబు ప్రదాన ప్రత్యర్థి జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థులు జాబితా విడుదలలో దూకుడుని ప్రదర్శించాడు. ఒకేసారి 170 నియోజకవర్గాల జాబితాను విడుదల చేశాడు జగన్ మోహన్ రెడ్డి. బాబు తర్వాత విడుదల చేసినా.. ఒకేసారి అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల జాబితానూ ప్రకటించేసి ఆ బరువును దించేశాడు జగన్. అయితే బాబు ఇలాంటి దూకుడును ప్రదర్శించలేకపోతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ కన్నా తమ పార్టీ అధ్యక్షుడే ముందుగా తొలి జాబితాను విడుదల చేశారని తెలుగుదేశం వాళ్లు ఉత్సాహంగా చెప్పుకొన్నారు అప్పట్లో. అయితే జగన్ అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చినా బాబు మాత్రం ఆ ప్రాసెస్ ను కంప్లీట్ చేయడం లేదు. మరి దీనిపై టీడీపీ వాళ్లు ఏమనుకొంటున్నారో...!

మరింత సమాచారం తెలుసుకోండి: