బీజేపీని అభినందించాలని అనిపిస్తోంది. కాస్త ఆలస్యం అయినా ఆ పార్టీ భేషైన నిర్ణయం తీసుకుంది. పొత్తుల్లో అనివార్యమని అన్నా.. అవకాశం లేకనే అని చెప్పినా.. కారణం ఏదైనా ఆ పార్టీ నిర్ణయం నచ్చింది. ఇంతకీ ఆ పార్టీ నిర్ణయం ఏమిటంటారా? ఇటీవలి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న వాళ్లకు టికెట్లు ఇవ్వకపోవడం. కాళ్లు పట్టుకుని బతిమలాడినా మరికొంతమందిని ససేమిరా పార్టీలో చేర్చుకోమని నిక్కచ్చిగా తేల్చి చెప్పడం. మోదీ హవా ఉందన్న ప్రచారం నేపథ్యంలో కృష్ణంరాజు, రఘురామ కృష్ణంరాజు, పురందేశ్వరి వంటివారు ఆ పార్టీ తీర్థం పుచ్చకున్నారు. రోజుకోసారి కావూరి సాంబశివరావు వెళ్లి అద్వానీ కాళ్లు పట్టుకుని బతిమలాడుతున్నారు. అయినా, పోటీకి వాళ్లని దూరం పెట్టింది ఆ పార్టీ. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలన్నీ – కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్.. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు - ఎంత సిగ్గు లేకుండా నిర్లజ్జగా వ్యవహరించాయంటే కేవలం టికెట్ కోసమే రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వాళ్లకు పెద్దపీట వేశాయి. ఇతర పార్టీల నుంచి ఫలానా నాయకులు వస్తారంటూ వారి కోసం ఆయా పార్టీల నాయకులే కర్చీఫులు కూడా వేశారు. మా పార్టీలోకి రా.. మా పార్టీలోకి రా అంటూ వ్యభిచారులకంటే దారుణంగా వ్యవహరించాయి. టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజానికి ఒక ఆకు రౌడీ. పొత్తులో భాగంగా అతనికి టీడీపీ మల్కాజిగిరి టికెట్ ఇవ్వలేకపోయింది. పటాన్ చెరు టికెట్ ఇస్తానని చెప్పింది. అయినా వినకుండా అతను చంద్రబాబు సమక్షంలో తల బాదుకుని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరాడు. పార్టీలో చేరినా ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన ఢిల్లో ఉండగానే కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. దాంతో నివ్వెరపోవడం హన్మంతరావు పనయింది. కానీ, ఢిల్లీ నుంచి వచ్చిన హన్మంతరావుకు టీఆర్ఎస్ నేతలు ఫోన్ చేశారు. మా పార్టీలోకి రా.. మల్కాజిగిరి అసెంబ్లీయేం ఖర్మ పార్లమెంటు టికెట్టే ఇస్తామని పిలిచారు. పిలిచి మరీ ఆయనను పార్టీలోకి చేర్పించుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ కు కూడా రాత్రికి రాత్రే టికెట్ ఇచ్చేసి టీఆర్ఎస్ తరించిపోయింది. ఒక్క టీఆర్ఎస్ నే తప్పుపట్టాల్సిన పని లేదు. గతంలో చెప్పుకొన్నట్లు టీడీపీ కూడా ఇంతే. ఇప్పటికే ఆ పార్టీ జాబితాలన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలను తలపిస్తుంటే తాజాగా, మంగళవారం ఉదయం పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు సీటు ఇచ్చేసింది. పార్టీలో చేరని పితాని సత్యనారాయణ, వనమా వెంకటేశ్వరరావు వంటి వారి కోసం సీటు రిజర్వు చేసేసి ఫలానా సీటు మీ కోసమే రిజర్వు చేశాం.. మీరు వస్తే అది మీదే అంటూ సంకేతాలు కూడా పంపింది. పార్టీలోకి ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉందని దుర్భిణి వేసి మరీ వెతికి వారిని పట్టుకుని టికెట్లు ఇచ్చింది. రాత్రికి రాత్రి పార్టీలోకి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడంలో వైసీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి అలా చేరగానే ఇలా టికెట్ ఇచ్చేసింది. ముందురోజు పార్టీలో చేరిన మాజీ మంత్రి పార్థసారథికి పొద్దున్నే ఎంపీ టికెట్ కేటాయించేసింది. ఇప్పటికే ఎటు వెళ్లాలో అర్థంకాని బూరగడ్డ వేదవ్యాస్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేసింది. పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచేసి ధర్మాన ప్రసాదరావు వంటి వారికి పెద్దపీట వేసింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. సీమాంధ్రలో ఆ పార్టీ నుంచి వెళ్లేవారే తప్ప వచ్చేవారు లేరు. దీంతో, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిలో ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఫోన్లు చేసి మరీ పిలిచింది. పిలిచిన వెంటనే వారికి టికెట్లు ఇచ్చేసింది. ఇక తెలంగాణలో అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ల కోసం ఎదురు చూసింది. వలసలు, ఆపరేషన్ ఆకర్ష్ లు, చేరికలతోనే ఇటీవలి కాలంలో చాలా పార్టీలు భ్రష్టుపట్టి పోయాయి. పార్టీలకు చెడ్డపేరు వచ్చింది. ఒక్కసారి రాష్ట్ర విభజనకు ముందుకు వెళితే.. అప్పుడు సీమాంధ్రలో, తెలంగాణలో మోడీ ప్రభంజనం కనిపించింది. రాష్ట్ర విభజనను మోడీ అడ్డుకుంటారన్న ప్రచారంతో సీమాంధ్రలో మరింత ఊపు వచ్చింది. దీంతో కొన్నేళ్ల కిందట బీజేపీకి దూరమైన సినీ నటుడు కృష్ణంరాజు ఆ పార్టీలో చేరారు. ఆయనకు కాకినాడ లేదా నర్సాపురం టికెట్ ఖాయమని అనుకున్నారు. వైసీపీతో విభేదాలు వచ్చిన రఘురామ కృష్ణంరాజు కూడా టీడీపీలో అవకాశాలు దక్కక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం నర్సాపురం టికెట్ కోసమే ఆయన ఆ పార్టీలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. ఆయనకు నర్సాపురం ఇస్తే కృష్ణం రాజుకు కాకినాడ టికెట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇక, కాంగ్రెస్ లోనే ఉంటే తన రాజకీయ జీవితానికి భరత వాక్యం తప్పదని భావించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా బీజేపీ పంచన చేరారు. ఆమె తన సిటింగ్ స్థానమైన విశాఖ కోసం పట్టుబట్టారు. కానీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి కేవలం నాలుగంటే నాలుగే లోక్ సభ స్థానాలు దక్కాయి. దాంతో, ఆ పార్టీకి పెద్ద సంకటం వదిలిపోయింది. అయినా, మిగిలిన పార్టీలు అయితే విశాఖను పురందేశ్వరికి, నర్సాపురాన్ని రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చేసేవి. బాగా డబ్బు ఇచ్చిన వ్యక్తికి తిరుపతి సీటును కట్టబెట్టేది. కానీ, బీజేపీ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకే టికెట్లు ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి శ్రీనివాస రావుకు ఇచ్చినా అదొక్కటే ఆ పార్టీ ఇచ్చినది. బీజేపీ పులు కడిగిన ముత్యమని చెప్పడం లేదు. కానీ, ఉన్న పార్టీల్లో ఆ పార్టీ కొంత మెరుగ్గా వ్యవహరించిందని చెప్పవచ్చు. విశాఖ సీటును పురందేశ్వరికి ఇవ్వకుండా హరిబాబునే నిలబెట్టడం వెనక రాజకీయం ఉండి ఉండవచ్చు. బీజేపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం. వైఎస్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆ పార్టీ తన కేంద్ర కార్యాలయంలో జెండాను అవనతం చేసింది. వైఎస్ అంటే ఆ పార్టీకి అంత భక్తి. విశాఖ సీటును పురందేశ్వరికి ఇస్తే అక్కడ నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. అదే హరిబాబుకు ఇస్తే విజయలక్ష్మి గెలుపు నల్లేరుపై బండి నడక. పార్టీ అభ్యర్థికి సీటు ఇచ్చినట్టూ ఉంటుంది. విజయలక్ష్మికి సహకరించినట్టూ ఉంటుందని కూడా ఆ సీటును పురందేశ్వరికి ఇవ్వకుండా ఉండి ఉండవచ్చు. విశాఖ, విజయవాడ, నర్సరావుపేట తదితర సీట్లన్నీ వదిలేసి పురందేశ్వరికి రాజంపేట సీటు ఇచ్చినా, ఆమెకు అసలు ఏ సీటూ ఇవ్వకపోయినా ఒకటే. కనీసం ఈ రకంగా అయినా బీజేపీ తాను మిగిలిన పార్టీలకు భిన్నమని నిరూపించుకుంది. బీజేపీని అభినందించాలని అనిపిస్తోంది. కాస్త ఆలస్యం అయినా ఆ పార్టీ భేషైన నిర్ణయం తీసుకుంది. పొత్తుల్లో అనివార్యమని అన్నా.. అవకాశం లేకనే అని చెప్పినా.. కారణం ఏదైనా ఆ పార్టీ నిర్ణయం నచ్చింది. ఇంతకీ ఆ పార్టీ నిర్ణయం ఏమిటంటారా? ఇటీవలి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న వాళ్లకు టికెట్లు ఇవ్వకపోవడం. కాళ్లు పట్టుకుని బతిమలాడినా మరికొంతమందిని ససేమిరా పార్టీలో చేర్చుకోమని నిక్కచ్చిగా తేల్చి చెప్పడం. మోదీ హవా ఉందన్న ప్రచారం నేపథ్యంలో కృష్ణంరాజు, రఘురామ కృష్ణంరాజు, పురందేశ్వరి వంటివారు ఆ పార్టీ తీర్థం పుచ్చకున్నారు. రోజుకోసారి కావూరి సాంబశివరావు వెళ్లి అద్వానీ కాళ్లు పట్టుకుని బతిమలాడుతున్నారు. అయినా, పోటీకి వాళ్లని దూరం పెట్టింది ఆ పార్టీ. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలన్నీ – కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్.. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు - ఎంత సిగ్గు లేకుండా నిర్లజ్జగా వ్యవహరించాయంటే కేవలం టికెట్ కోసమే రాత్రికి రాత్రి పార్టీలో చేరిన వాళ్లకు పెద్దపీట వేశాయి. ఇతర పార్టీల నుంచి ఫలానా నాయకులు వస్తారంటూ వారి కోసం ఆయా పార్టీల నాయకులే కర్చీఫులు కూడా వేశారు. మా పార్టీలోకి రా.. మా పార్టీలోకి రా అంటూ వ్యభిచారులకంటే దారుణంగా వ్యవహరించాయి. టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నిజానికి ఒక ఆకు రౌడీ. పొత్తులో భాగంగా అతనికి టీడీపీ మల్కాజిగిరి టికెట్ ఇవ్వలేకపోయింది. పటాన్ చెరు టికెట్ ఇస్తానని చెప్పింది. అయినా వినకుండా అతను చంద్రబాబు సమక్షంలో తల బాదుకుని ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ లో చేరాడు. పార్టీలో చేరినా ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఆయన ఢిల్లో ఉండగానే కాంగ్రెస్ జాబితా విడుదల చేసింది. దాంతో నివ్వెరపోవడం హన్మంతరావు పనయింది. కానీ, ఢిల్లీ నుంచి వచ్చిన హన్మంతరావుకు టీఆర్ఎస్ నేతలు ఫోన్ చేశారు. మా పార్టీలోకి రా.. మల్కాజిగిరి అసెంబ్లీయేం ఖర్మ పార్లమెంటు టికెట్టే ఇస్తామని పిలిచారు. పిలిచి మరీ ఆయనను పార్టీలోకి చేర్పించుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ కు కూడా రాత్రికి రాత్రే టికెట్ ఇచ్చేసి టీఆర్ఎస్ తరించిపోయింది. ఒక్క టీఆర్ఎస్ నే తప్పుపట్టాల్సిన పని లేదు. గతంలో చెప్పుకొన్నట్లు టీడీపీ కూడా ఇంతే. ఇప్పటికే ఆ పార్టీ జాబితాలన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలను తలపిస్తుంటే తాజాగా, మంగళవారం ఉదయం పార్టీలో చేరిన మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఒంగోలు సీటు ఇచ్చేసింది. పార్టీలో చేరని పితాని సత్యనారాయణ, వనమా వెంకటేశ్వరరావు వంటి వారి కోసం సీటు రిజర్వు చేసేసి ఫలానా సీటు మీ కోసమే రిజర్వు చేశాం.. మీరు వస్తే అది మీదే అంటూ సంకేతాలు కూడా పంపింది. పార్టీలోకి ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉందని దుర్భిణి వేసి మరీ వెతికి వారిని పట్టుకుని టికెట్లు ఇచ్చింది. రాత్రికి రాత్రి పార్టీలోకి వచ్చిన వాళ్లకు పెద్దపీట వేయడంలో వైసీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు. మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి అలా చేరగానే ఇలా టికెట్ ఇచ్చేసింది. ముందురోజు పార్టీలో చేరిన మాజీ మంత్రి పార్థసారథికి పొద్దున్నే ఎంపీ టికెట్ కేటాయించేసింది. ఇప్పటికే ఎటు వెళ్లాలో అర్థంకాని బూరగడ్డ వేదవ్యాస్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేసింది. పార్టీని ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచేసి ధర్మాన ప్రసాదరావు వంటి వారికి పెద్దపీట వేసింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. సీమాంధ్రలో ఆ పార్టీ నుంచి వెళ్లేవారే తప్ప వచ్చేవారు లేరు. దీంతో, పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిలో ఇంకా ఎవరైనా వస్తారేమోనని ఫోన్లు చేసి మరీ పిలిచింది. పిలిచిన వెంటనే వారికి టికెట్లు ఇచ్చేసింది. ఇక తెలంగాణలో అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ల కోసం ఎదురు చూసింది. వలసలు, ఆపరేషన్ ఆకర్ష్ లు, చేరికలతోనే ఇటీవలి కాలంలో చాలా పార్టీలు భ్రష్టుపట్టి పోయాయి. పార్టీలకు చెడ్డపేరు వచ్చింది. ఒక్కసారి రాష్ట్ర విభజనకు ముందుకు వెళితే.. అప్పుడు సీమాంధ్రలో, తెలంగాణలో మోడీ ప్రభంజనం కనిపించింది. రాష్ట్ర విభజనను మోడీ అడ్డుకుంటారన్న ప్రచారంతో సీమాంధ్రలో మరింత ఊపు వచ్చింది. దీంతో కొన్నేళ్ల కిందట బీజేపీకి దూరమైన సినీ నటుడు కృష్ణంరాజు ఆ పార్టీలో చేరారు. ఆయనకు కాకినాడ లేదా నర్సాపురం టికెట్ ఖాయమని అనుకున్నారు. వైసీపీతో విభేదాలు వచ్చిన రఘురామ కృష్ణంరాజు కూడా టీడీపీలో అవకాశాలు దక్కక బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం నర్సాపురం టికెట్ కోసమే ఆయన ఆ పార్టీలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. ఆయనకు నర్సాపురం ఇస్తే కృష్ణం రాజుకు కాకినాడ టికెట్ ఖాయమన్న ప్రచారం జరిగింది. ఇక, కాంగ్రెస్ లోనే ఉంటే తన రాజకీయ జీవితానికి భరత వాక్యం తప్పదని భావించిన కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా బీజేపీ పంచన చేరారు. ఆమె తన సిటింగ్ స్థానమైన విశాఖ కోసం పట్టుబట్టారు. కానీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి కేవలం నాలుగంటే నాలుగే లోక్ సభ స్థానాలు దక్కాయి. దాంతో, ఆ పార్టీకి పెద్ద సంకటం వదిలిపోయింది. అయినా, మిగిలిన పార్టీలు అయితే విశాఖను పురందేశ్వరికి, నర్సాపురాన్ని రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చేసేవి. బాగా డబ్బు ఇచ్చిన వ్యక్తికి తిరుపతి సీటును కట్టబెట్టేది. కానీ, బీజేపీ పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకే టికెట్లు ఇచ్చింది. ఎమ్మెల్యే టికెట్ల పంపిణీలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి శ్రీనివాస రావుకు ఇచ్చినా అదొక్కటే ఆ పార్టీ ఇచ్చినది. బీజేపీ పులు కడిగిన ముత్యమని చెప్పడం లేదు. కానీ, ఉన్న పార్టీల్లో ఆ పార్టీ కొంత మెరుగ్గా వ్యవహరించిందని చెప్పవచ్చు. విశాఖ సీటును పురందేశ్వరికి ఇవ్వకుండా హరిబాబునే నిలబెట్టడం వెనక రాజకీయం ఉండి ఉండవచ్చు. బీజేపీకి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం. వైఎస్ చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆ పార్టీ తన కేంద్ర కార్యాలయంలో జెండాను అవనతం చేసింది. వైఎస్ అంటే ఆ పార్టీకి అంత భక్తి. విశాఖ సీటును పురందేశ్వరికి ఇస్తే అక్కడ నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. అదే హరిబాబుకు ఇస్తే విజయలక్ష్మి గెలుపు నల్లేరుపై బండి నడక. పార్టీ అభ్యర్థికి సీటు ఇచ్చినట్టూ ఉంటుంది. విజయలక్ష్మికి సహకరించినట్టూ ఉంటుందని కూడా ఆ సీటును పురందేశ్వరికి ఇవ్వకుండా ఉండి ఉండవచ్చు. విశాఖ, విజయవాడ, నర్సరావుపేట తదితర సీట్లన్నీ వదిలేసి పురందేశ్వరికి రాజంపేట సీటు ఇచ్చినా, ఆమెకు అసలు ఏ సీటూ ఇవ్వకపోయినా ఒకటే. కనీసం ఈ రకంగా అయినా బీజేపీ తాను మిగిలిన పార్టీలకు భిన్నమని నిరూపించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: