రాజ్యసభ మాజీ సభ్యుడు నందమూరి హరికృష్ణకు తెదేపా అధినేత చంద్రబాబు కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ టికెట్‌ ఆశించిన హరికృష్ణకు చంద్రబాబు మొండిచేయి చూపించి ఈ టికెట్‌ను ఆయన సోదరుడు నందమూరి బాలకృష్ణకు కట్టబెట్టిన వైనంపై ఆయన తీవ్రస్థాయిలో రగులు తున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లిd స్థానంలోనైనా తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని హరికృష్ణ చేసిన అభ్యర్థనను చంద్రబాబు బేఖాతరు చేసినట్టు ప్రచారం జరుగు తోంది. కృష్ణా జిల్లాలో మరేదైనా అసెంబ్లిdని తనకు కేటాయిస్తారన్న ఆశతో హరికృష్ణ ఉన్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం హరికృష్ణకు అసెంబ్లిd లేదా లోక్‌సభ ఎన్నిక ల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరాదని తెదేపా అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. హరికృష్ణ కుటుంబంతో చంద్రబాబుకు అంతరం పెరగడంతో ఆయనను దూరంగా పెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన ట్టు తెలుస్తోంది. దీనికితోడు జూనియర్‌ ఎన్టీఆర్‌ వైఖరిపై చంద్ర బాబు భగ్గుమంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. తనకు మాట మాత్రమైనా చెప్పకుండా రాష్ట్ర విభజ నకు నిరసనగా హరికృష్ణ తన పదవికి రాజీనామా చేశారని, అంతకుముందు ఆయన వ్యవహరించిన తీరును, వైఖరితో చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యకలాపాలకు వీలైనంత దూరంగా హరికృష్ణ కుటుంబాన్ని ఉంచాలన్న ప్రతిపాదనకు చంద్రబా బు వచ్చినట్టు సమాచారం. మీడియాలో, పార్టీవర్గాల్లో చంద్రబాబుపై హరికృష్ణ తీవ్రస్థాయి లో విరుచుకుపడడంతోపాటు ఆయనపై లేనిపోని ఆరోపణలు చేశారన్న అపవాదు ఉంది. ఇటీవల జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశాలకు హాజరై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని హరికృష్ణ చంద్రబాబును వేడుకున్నారు. పార్టీ టికెట్‌ కేటాయించేందుకు ఎటువంటి హామీ ఇవ్వని చంద్రబాబు టికెట్ల కేటాయింపులో హరికృష్ణకు రిక్తహస్తం చూపించారు. ఇదిలాఉండగా, హరికృష్ణ బుధవారం కొంత మంది మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, అసెంబ్లిd టికెట్‌ను తాను అడగలేదని వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. హిందూపురం టికెట్‌ను తాను ఆశించానని అయితే ఈ టికెట్‌ను తన సోదరుడు బాలకృష్ణకు కట్టబెట్టార ని చెప్పారు. అంతకుముందు కృష్ణా జిల్లా పెనమ లూరు అసెంబ్లిd స్థానాన్ని తనకివ్వాలని అధినేత చంద్రబాబును కోరానని, అయితే ఈ అసెంబ్లి స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తారన్న విషయాన్ని చెప్పారని ఆయన అన్నారు. చివరి క్షణం వరకు టికెట్‌ కోసం తాను ప్రయత్నిస్తానని కృష్ణా జిల్లాలో ఏదో ఒక అసెంబ్లిd తనకు కేటాయిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. హిందూపురం అసెంబ్లి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన బాలకృష్ణ జూనియర్‌ ఎన్టీఆర్‌పై పరోక్ష ఆరోపణలకు దిగారు. ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ వస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఎవరినీ బొట్టుపెట్టి పిలిచేది లేదని, పార్టీపై, వ్యవస్థాపకుడు నందమూరి రామా రావుపై ప్రేమ, అభిమానం ఉంటే ఎవరైనా పార్టీ తరఫున అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాని కి వస్తారని సమాధానమిచ్చారు. మొత్తంమీద జరుగుతున్న పరిణామా లను బట్టి చూస్తుంటే హరికృష్ణ కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంచాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే బాలకృష్ణకు హిందూపురం టికెట్‌ను కేటాయిం చారన్న ప్రచారం పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల ప్రచారానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ సన్నద్ధమవుతున్నట్టు పార్టీలో ఒక వర్గం చెబుతోంది. బాబాయ్‌ బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో తాను కూడా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళితే బాగుంటుందన్న అభిప్రాయం జూనియర్‌ ఎన్టీఆర్‌లో వ్యక్తమైనట్టు ఆయన సన్నిహి తులు చెబుతున్నారు. ఏదిఏమైనా తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబ రాజకీయాలు చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఇది ఎటువైపు దారితీస్తాయో నన్న ఆందోళన, ఉత్కంఠ పార్టీ నేతల్లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: