కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి బిజెపిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటు పురందీశ్వరికి రాజంపేట నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ టికెట్ లభించింది. చివరి క్షణం వరకూ ఆమెకు లభిస్తుందా లేదా అన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ అధినాయకత్వం బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించింది. తెలుగుదేశం, బిజెపి మధ్య కుదరిని పొత్తు ప్రకారం నాలుగు లోక్‌సభ స్థానాలను బిజెపికి కేటాయించారు. పురందీశ్వరి బిజెపిలో చేరిన తర్వాత తన సొంత నియోజక వర్గమైన విశాఖ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, సీమాంధ్ర పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె.హరిబాబు విశాఖ నుంచి పోటీ చేయాలని కృత నిశ్చయంతో వ్యవహరించారు. ఫలితంగా పురందీశ్వరి వ్యవహారం అయోమయంలో పడింది. ఆమెకు టికెట్ ఇచ్చే విషయంలో చివరి క్షణం వరకూ సస్పెన్స్ కొనసాగింది. తెలుగు దేశంతో పొట్టు కుదుర్చుకున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జోక్యం ఇస్తామని బిజెపి అధినాయకత్వం ఇంతకు ముందే ఆమెకు స్పష్టం చేసింది. చివరికి సొంత సోదరి భువనేశ్వరి కూడా పురందీశ్వరికి టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు. దిక్కుతోచని స్థితిలో గత రాత్రి దగ్గుబాటి దంపతులు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ను కలిసి తమకు టికెట్ ఇవ్వాలని కోరారు. వాస్తవానికి స్థానికులకే రాజంపేట టికెట్ ఇవ్వాలని సీమాంధ్ర శాఖ సిఫార్సు చేసినప్పటికీ పురంధ్రీశ్వరి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెకు టికెట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: