సబ్బం హరి. విశాఖకు లోకల్ లీడర్. అలాంటి వాడు జగన్ ను ధిక్కరించి ఒక్కసారి 'పచ్చ' పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కేసాడు. విశాఖ వ్యవహారాలు తెలియని వారు, అమ్మో అదెంత పెద్ద నాయకుడో అనుకున్నారు. నిజానికి హరిని కాంగ్రెస్ పార్టీ గతంలోనే బయటకు పంపింది. సామాజిక వర్గ బంధంతో కెవిపిని మంచి చేసుకుంటే, ఎలాగూ గెలవలేని సీటు, అల్లు అరవింత్, సూర్య అధినేత ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా అని, అనకాపల్లి ఎంపీకి పంపించారు. ఇద్దరు కాపుల నడుమ, ఓ వెలమ అభ్యర్థిగా, వైఎస్ చరిష్మాతో కొట్టుకొచ్చేసాడు. ఆపై జగన్ వెంట వుండి, ఓదార్పు యాత్రలు నిర్వహించి, జైల్లో కలిసి వచ్చి నానా హడావుడి చేసాడు. తీరా చేసి ఎక్కడ చెడిందో ఇద్దరికీ చెడింది. నోటికి వచ్చినట్లు మాట్లాడి హీరో అయిపోయాడు. అంతవరకు బాగానేవుంది సమైక్యాంద్ర పార్టీ తరపున పోటీ చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు నామినేషన్ పడలా. పేరు కూడా వినిపించలా? ఏమయినట్లు? తెలివిన వాడు కనుక, చేతులు కాల్చుకోవడం ఎందుకనుకున్నాడా? గెలిచినా ఓడినా పార్టీ ఎలాగూ కాంగ్రెస్ లోకే వెళ్తుంది కాబట్టి, వచ్చే మేయర్ ఎన్నికలకు రెడీ అవుదాం అని ఇప్పుడు ఊరుకున్నాడా?

మరింత సమాచారం తెలుసుకోండి: