అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపుతున్నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుకుమధ్యవర్తిగా రోజూ వార్తలు రాసిన మీడియా నే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు బ్రేకప్ అయ్యిందని వార్తలు రాస్తోంది. తెలుగుదేశం అధ్యక్షుడు సీమాంధ్ర పరిధిలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సెలవిద్దామని అనుకొంటున్నాడని ఆ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సీట్ల విషయంలో ఏర్పడిన పోటీని దృష్టిలో ఉంచుకొని ఒంటరిగా బరిలోకి దిగాలని చంద్రబాబు నిర్ణయించడాని వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు వంటి విజన్ ఉన్న నేత బీజేపీతో పొత్తు పెట్టుకొన్నప్పుడే ఇలాంటి పరిణామాలను ఊహించలేదా? అనే అనుమానం తలెత్తుతుంది. అయితే తెలుగుదేశం అధ్యక్షుడు ఒక వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోందిప్పుడు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరినప్పటికీ ఆ పార్టీని కూడా తనే ఆడించాలని తెలుగుదేశం అధ్యక్షుడు భావించాడు. ఆ పార్టీలో తను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరుకొన్నట్టు తెలుస్తోంది. అయితే అది కుదరకపోవడంతో బాబు పొత్తుకు బ్రేకప్ అని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకొన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు రాజకీయాల్లో ఇది కొత్త కాదు. గతంలో మహాకూటమి తరపున ఎన్నికలకు వెళ్లికూడా కొన్ని నియోజకవర్గాల్లో తెరాసకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ దెబ్బకు టీఆర్ఎస్ అప్పట్లో విలవిలలాడింది. ఇప్పుడు బీజేపీకి కూడా అదే అనుభవాన్ని ఇచ్చేలా ఉన్నాడు తెలుగుదేశం అధినేత. సీమాంధ్రలో ఇంకా నామినేషన్లకు గడువు ఉండటంతో చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించిన అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం వాళ్ల చేత నామినేషన్ వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బాబు మార్కు రాజకీయంతో ఇప్పుడు బీజేపీకి తలబొప్పి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది! అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపుతున్నాడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. భారతీయ జనతా పార్టీ , తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుకుమధ్యవర్తిగా రోజూ వార్తలు రాసిన మీడియా నే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు బ్రేకప్ అయ్యిందని వార్తలు రాస్తోంది. తెలుగుదేశం అధ్యక్షుడు సీమాంధ్ర పరిధిలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సెలవిద్దామని అనుకొంటున్నాడని ఆ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సీమాంధ్రలో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సీట్ల విషయంలో ఏర్పడిన పోటీని దృష్టిలో ఉంచుకొని ఒంటరిగా బరిలోకి దిగాలని చంద్రబాబు నిర్ణయించడాని వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు వంటి విజన్ ఉన్న నేత బీజేపీతో పొత్తు పెట్టుకొన్నప్పుడే ఇలాంటి పరిణామాలను ఊహించలేదా? అనే అనుమానం తలెత్తుతుంది. అయితే తెలుగుదేశం అధ్యక్షుడు ఒక వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోందిప్పుడు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదిరినప్పటికీ ఆ పార్టీని కూడా తనే ఆడించాలని తెలుగుదేశం అధ్యక్షుడు భావించాడు. ఆ పార్టీలో తను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరుకొన్నట్టు తెలుస్తోంది. అయితే అది కుదరకపోవడంతో బాబు పొత్తుకు బ్రేకప్ అని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకొన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు రాజకీయాల్లో ఇది కొత్త కాదు. గతంలో మహాకూటమి తరపున ఎన్నికలకు వెళ్లికూడా కొన్ని నియోజకవర్గాల్లో తెరాసకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ దెబ్బకు టీఆర్ఎస్ అప్పట్లో విలవిలలాడింది. ఇప్పుడు బీజేపీకి కూడా అదే అనుభవాన్ని ఇచ్చేలా ఉన్నాడు తెలుగుదేశం అధినేత. సీమాంధ్రలో ఇంకా నామినేషన్లకు గడువు ఉండటంతో చంద్రబాబు నాయుడు బీజేపీకి కేటాయించిన అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం వాళ్ల చేత నామినేషన్ వేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి బాబు మార్కు రాజకీయంతో ఇప్పుడు బీజేపీకి తలబొప్పి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: