పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి తనపై 22 కేసులు నమోదైనట్లు ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ కేసులన్నీ సిబిఐ కోర్టులో 2012 ఏప్రిల్ మాసం నుండి పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సిబిఐ ప్రిన్సిపల్ జడ్జి కోర్టులో మొట్టమొదటి సారిగా సిబిఐ అధికారులు 2012 ఏప్రిల్ 27వ తేదీన కేసులు ఫైల్ చేశారని తెలిపారు. అదే ఏడాది మే 29, 30, సెప్టెంబర్ 13, 2013లో మే 13న, సెప్టెంబర్ 17న, 25న, 28న, 30న, అక్టోబర్ 10న న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలయిందన్నారు. కడప వైఎస్సార్ జిల్లాలోని కమలాపురం జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో 2012 ఏప్రిల్ 10న ఒక కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే సిబిఐ ప్రభుత్వాన్ని మోసగించడం, అవినీతి, ప్రభుత్వ ఉద్యోగులను లోబరుచుకోవడం, బెదిరింపు, మోసపూరితం, నమ్మకాన్ని పోగొట్టుకోవడం తదితర ఆర్థిక నేరాలపై కేసులను నమోదయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజాస్వామ్యంలో భాగస్వాములను చేసి వారిని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో ఈ కేసులను నమోదు చేశారు. ప్రభుత్వ వనరులను ప్రక్కదారి పట్టించి, ప్రభుత్వ ఆదాయానికి భంగం కల్పించేలా ప్రవర్తించారనే అభియోగాలతో వివిధ సెక్షన్లతో నమోదయిన 22 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులన్నీ నిరూపణ కావని ఆయన తన ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. కేసులన్నీ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్నాయని, తాను ఏటువంటి శిక్షార్హుడిని కానని జగన్మోహనరెడ్డి తన ఆఫిడవిట్‌లో పేర్కొన్నార

మరింత సమాచారం తెలుసుకోండి: