తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జిల్లాలో కీలకమయ్యారు.. మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించారు.. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూనే ఉద్యమంలో ముందుకు నడిచారు.. అందరి పోరా టాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.. ఇదే ఊపుతో ఉన్న కోమటి రెడ్డి బ్రదర్స్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. జిల్లాలో చక్రం తిప్పుతూ అలుపెరగ ని పోరుతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు టికెట్లు రావని వ్యతిరేకులు ప్రచారం చేసినా పట్టుదల, మొక్కవోని దీక్షతో వ్యవహరించి వారికే కాకుండా వారి అనుచరులందరికి టికెట్లు తెచ్చుకు న్నారు. వ్యూహాత్మకంగా పావులు కదిపి టికెట్లను పొందడంలో సక్సెస్‌ అయిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ ప్రచారంలో ముందున్నారు. నల్గొండ అసెంబ్లికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి పార్లమెంట్‌కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, నకిరేకల్‌ అసెంబ్లికి చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి అసెంబ్లికి అద్దంకి దయాకర్‌, భువనగిరి అసెంబ్లికి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఆలేరులో బూడిద భిక్షమ య్యగౌడ్‌, మునుగోడులో కాంగ్రెస్‌ బలపర్చిన సీపీఐ అభ్యర్ధి పల్లా వెంకట్‌రెడ్డిలు పోటీ చేస్తున్నారు.  వీరంద రి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకం గా వారి అనుచరులకు టికెట్లు దక్కించుకున్న కోమటి రెడ్డి బ్రదర్స్‌ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకొని మండుటెండను సైతం లెక్క చేయకుండా ప్రచారంలో పరుగులు పెట్టిస్తున్నారు.నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారం నిర్వహిస్తూనే బ్రదర్‌ రాజ గోపాల్‌రెడ్డి, అనుచరుల గెలుపునకు తీవ్ర ప్రయ త్నాలు చేస్తున్నారు. భువనగిరి పార్లమెంట్‌లో కోమటి రెడ్డి బ్రదర్స్‌ సుడిగాలి పర్యటనలతో ఓటర్ల ముందుకు వెళ్తున్నా రు. ఇప్పటికే తుంగతుర్తి, మునుగోడు, భువనగిరి నియోజక వర్గాల్లో విస్తృతంగా పర్యటించారు.  ఐదారు రోజులుగా అలుపెరగని ప్రచారం నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు జనం ముంగిటనే ఉంటూ అభ్యర్థుల గెలుపునకు బాటలు వేస్తున్నారు. అంతే కాకుండా నకిరేకల్‌, ఆలేరులలో కూడా తమ ప్రచారాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను గుర్తుపెట్టుకొని కాంగ్రెస్‌కు ఓట్లు వేయాలని కోరుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమనే నినాదంతో అడుగులు వేస్తున్నారు. వాడి, వేడి ప్రసంగాలు చేస్తూ ఆకట్టుకుం టున్నారు. రోడ్‌షోలు, ప్రధాన కూడళ్లలో సభలు నిర్వహిస్తూ ప్రజల ముంగిట నిలుస్తున్నారు. ఏది ఏమైనా కోమటిరెడ్డి బ్రదర్స్‌ జిల్లా కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతూ తమదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: