సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ శుక్రవారం తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఆమేనిఫెస్టోలో ఆడవాళ్లకు కలర్ టివిలు ఉచితంగా ఇస్తామని, ప్రభుత్వ కార్యాలయాల్లో పని దినాలను ఐదు రోజులకు కుదిస్తామని పొందుపర్చారు. ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి కేంద్రమంత్రి జైరాం రమేష్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  వైయస్సార్  పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మండిపడ్డారు. టిడిపి, జగన్ పార్టీ మేనిఫెస్టోలు నమ్మవద్దన్నారు.  ప్రజల మనోభావాల ప్రకారమే తమ మేనిఫెస్టో ఉందన్నారు. తాము ఆచరణ సాధ్యమయ్యే వాటినే పేర్కొన్నామన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ మేనిఫెస్టో అన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు జగన్ అధికారంలో లేనప్పుడే దోచుకున్నారని ఇక అధికారంలోకి వస్తే ఏమీ ఉండదన్నారు. మేనిఫెస్టోలోని అంశాలు. రానున్న ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఉండదు కృష్ణా, గోదావరి పెన్నా నదుల అనుసంధానం విశాఖ విజయవాడ తిరుపతిల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు పేదలకు జనతా వస్త్రాల పంపిణీ ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు లాప్‌టాప్‌లు జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు స్వయం సహాయక రుణాల మాఫీ ఆడపిల్ల పుడితే 100 గజాల స్థలం బెల్టు షాపులు మూసివేయించడం ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని దినాలు రిటైర్మెంట్ వయస్సు అరవయ్యేళ్లు 5వేల కోట్లతో రైతుల అత్యవసర సహాయనిధి వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: