కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి మెట్టు దిగినా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బెట్టు వీడటం లేదా అంటే అవుననే అంటున్నారు. బిజెపి టిడిపిల మధ్య పొత్తు చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. బిజెపి పలుచోట్ల బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందని వాటిని చూస్తుంటే భయం వేస్తోందని చంద్రబాబు గురువారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. బిజెపి టిడిపి పొత్తు అలజడికి పలు కారణాలు ఉన్నాయి. నర్సాపురం విశాఖపట్నం పలుచోట్ల బిజెపి బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందని  అంతేకాకుండా తెలంగాణకు మద్దతిచ్చిన బిజెపితో పొత్తు వద్దని సీమాంధ్ర టిడిపి నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా బిజెపితో కలిసి పోటీ చేస్తే మైనార్టీలు దూరమవుతారని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి తెలంగాణకు మద్దతివ్వడం. అంతేకాకుండా ఇటీవల మైనార్టీలు బిజెపికి దగ్గరవుతున్నట్లుగా చెబుతున్నారు. తొలుత విశాఖ సీటును పురంధేశ్వరికి ఇచ్చేందుకు బిజెపి సుముఖత చూపినప్పటికీ బాబు కారణంగానే ఆ సీటును కోరుకుంటున్న కంభంపాటి హరిబాబుకు వెళ్లిందంటున్నారు. ఇప్పుడు ఆమెకు బిజెపి రాజంపేట టిక్కెట్ ఇచ్చింది. దీనిని కూడా బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వవద్దని చంద్రబాబు బిజెపికి షరతు పెట్టినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చినా వాటిని ఖండించారు. అయితే, ప్రస్తుత వ్యవహారాలు చూస్తుంటే అది నిజమేనన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు. చంద్రబాబుకు, టిడిపికి దశాబ్దానికి పైగా దూరంగా ఉన్న పురంధేశ్వరి. బిజెపిలో చేరినప్పటి నుండి. టిడిపితో పొత్తు కుదిరితే తనకు అభ్యంతరం లేదని చెప్పారు. అంతేకాదు పొత్తు కుదిరాక అధిష్టానం ఆదేశిస్తే టిడిపి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానన్నారు. బాబుతో వేదిక పంచుకునే విషయం పైన కూడా ఆమె విముఖత మాత్రం వ్యక్తం చేయలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: