అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా పడ్డాదిలే.... అని అదేదో పాట లా ఉంది పొట్లూరి వ్యవహారం. ఎన్నో ఆశలు పవన్ పై పెట్టుకుంటే ఆ ఆశలపై నీళ్లు చల్లాడు మనోడు. అటు బిజేపీ నుంచి ఇటు టీడీపీ నుంచి టికెట్ రాక కనీసం ఇండిపెండెంట్ గానైనా నిలబడి పవన్ సహాయం తీసుకుందాంమంటే తను మద్దతు ఇవ్వను అనే సరికి ఏం చేయాలో తెలియన సంకట స్థతిలో ఉన్నాడు పొట్లూరి.విజయవాడ లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్న పొట్లూరి వర ప్రసాద్‌కి జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ నుండి చేదు అనుభవం ఎదురయిందట. బిజెపి తరఫున విజయవాడ నుండి పోటీ చేయాలని పొట్లూరి భావించారు. ఆ పార్టీ నుండి టిక్కెట్ రాకపోవడంతో ఆయన మూడు రోజులుగా పవన్‌ను కలుస్తున్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తనకు మద్దతివ్వాలని తన తరఫున ప్రచారం చేయాలని కోరారు. దీనిపై శుక్రవారం సాయంత్రం పవన్ ఏం చేస్తారనే విషయంపై వార్తలు వచ్చాయి. అయితే పవన్ పొట్లూరికి మద్దతు అంశంపై బహిరంగంగా స్పందించక పోయినప్పటికీ ఆయనతో చెప్పినట్లుగా తెలుస్తోంది.  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే తాను మద్దతివ్వలేదని పవన్ ఆయనకు సూటిగా చెప్పేశారట. దీంతో శనివారం నామినేషన్ దాఖలు చేద్దామనుకున్న పివిపి అందుకు సిద్ధంగా లేనట్లు చెబుతున్నారు. పవన్ మద్దతిస్తే రేపు మధ్యాహ్నం నామినేషన్ వేయాలని ఆయన భావించారు. అయితే పవన్ నుండి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆయన తగ్గారట. పవన్ బిజెపి  టిడిపిల కూటమికే ప్రచారం చేయాలని భావిస్తున్నారట.   

మరింత సమాచారం తెలుసుకోండి: