టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలందరికి పేరుకు ముందు ఏదో ఒక బిరుదు ఉంటుంది. అలాగే మెగా హీరో రామ్‌చరణ్‌కు మెగాపవర్‌స్టార్‌ అని ఉంటుంది. తండ్రి నుండి మెగా, బాబయి నుండి పవర్‌ను తీసుకుని ఈయన మెగా పవర్‌ స్టార్‌ అని పిలిపించుకుంటున్నాడు. అయితే ఈయన తాజాగా తన పేరు నుండి పవర్‌ను తీసి వేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై తన చిత్రాల్లో మెగా స్టార్‌ అని వేయించుకోబోతున్నాడు రామ్‌చరణ్‌. బాబాయిపై ఉన్న కోపంతోనే పవర్‌ను వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు నిలువున చీలిన విషయం తెల్సిందే. అయితే ఇప్పటికే తన తండ్రికే మద్దతు ఇస్తాను అని ప్రకటించిన చరణ్‌ ఆ మధ్య పవన్‌ సభకు పోటీగా ఒక సభను నిర్వహించాలని తలపెట్టాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సభను కాస్త చిన్న సమావేశంగా మార్చుకున్నాడు. పవన్‌పై కోపంగా ఉన్న చరణ్‌ తన పేరుకు ముందు పవర్‌ తీసేసుకోవాలని చూస్తున్నాడు. తన తండ్రి ఎలాగూ సినిమాల్లో లేడు కావున ఆయన బిరుదు మెగాస్టార్‌ను తన పేరు ముందు పెట్టుకుంటే బాగుంటుందని చరణ్‌ భావిస్తున్నాడు. ఈ విషయమై ఇప్పటికే అభిమాన సంఘాల నేతలకు చరణ్‌ సన్నిహితులు చేరవేసినట్లు తెలుస్తోంది. ఇకపై చరణ్‌ను ఎక్కడ కూడా మెగాపవర్‌స్టార్‌ అని సంబోదించ వద్దు అని అభిమానులకు మెసేజ్‌లు పోతున్నట్లు తెలుస్తోంది. చరణ్‌ రాబోయే చిత్రం ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రంలో చరణ్‌కు పేరు ముందు ఏం ఉంటుందో అని ఇప్పటి నుండి ఆసక్తి నెలకొంది. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఆ చిత్రంను కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. బండ్ల గణేష్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: