టికెట్ల విషయంలో అలిగిన ప్రతి ఒక్క వాళ్లకూ ఎమ్మెల్సీ హామీని ఇస్తున్నాడు తెలుగుదేశం అధినేత. అసంతృప్త వాదులుగా వారు పార్టీకి నష్టం చేయకుండా ఉండటానికి బాబు వారిని శాసనమండలికి పంపిస్తానని అంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నాడు. ఒకరు కాదు ఇద్దరు ఈ జాబితాలో అనేక మంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు టికెట్ లభించని వాళ్లందరి భవిష్యత్తునూ శాసనసమండలితో ముడిపెడుతున్నాడాయన. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల పొత్తులో భాగంగా బీజేపీ ఐదో ఎంపీ సీటుపై ఆశలు వదిలేసుకొన్నందుకు గానూ మూడు ఎమ్మెల్సీ సీట్లకు హామీని పొందిందట. మొదట బీజేపీకి ఐదు ఎంపీ సీట్లు ఇస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అయితే ఆ తర్వాత అందులో ఒకటి కోత పెట్టారు. అందుకు గానూ మూడు ఎమ్మెల్సీ సీట్లను ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చాడట. ఆ తర్వాత ఇప్పుడు ఇచ్చాపురం సీటును కూడా తెలుగుదేశం పార్టీకి వదలుకొంది భారతీయ జనతా పార్టీ. కోటాలో వచ్చిన 14 సీట్లలో ఒకదాన్ని వదులుకొని ఒక సీటును తెలుగుదేశానికి త్యాగం చేసింది కమలం పార్టీ, ఇందుకుగానూ ఒక ఎమ్మెల్సీ సీటును హామీ గా పొందిందట. బీజేపీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లను హామీగా ఇచ్చిన చంద్రబాబు అనేక మంది తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఆశవహులకు కూడా ఇదే హామీని ఇచ్చాడట. ఇప్పుడు టికెట్ అవకాశం దక్కని టీఎస్ రామారావు, లింగారెడ్డి తోసహా దాదాపు డజను మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను శాసనమండలి కి పంపుతానని తెలుగుదేశం అధినేత హామీఇ చ్చాడట. అయితే మండలికి పంపడం అంటే అనేక రకాలుగా ఉంటుంది ఆప్రక్రియ. గవర్నర్ కోటా అని, జడ్పీ కోటా అని.. ఇంకా రకరకాల గొడవలుంటాయి. ఆ విషయంలో అనుకొన్న వాళ్లకు అవకాశం ఇవ్వాలంటే ముందుగా అధికారాన్ని సాధించాల్సి ఉంటుందనే విషయం తెలుగు తమ్ముళ్లకు తెలిసే ఉంటుందేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: