ముద్దుల పండగ వేడుకకు రంగం సిద్దం అయ్యింది. ఇండోనేషియా లోని బాలి ప్రాంతంలో ఈ వేడుక జరగనుంది,'ఒమెడ్ ఒమెడన్ 'పేరుతో జరిగే ఈ వేడుకలో ప్రేయసీ ప్రియులు బహిరంగంగా ముద్దుల వర్షం కురిపించే అవకాశం లభిస్తుంది. అమ్మాయిలు సిగ్గుల మొగ్గలు అవుతుండగా అబ్బాయిలు దర్జాగా అమ్మాయిలను బిగి కౌగిలిలో బంధించి ముద్దులను దొంగిలిస్తారు ఇదంతా కూడా బహిరంగంగా జరుగుతుందట! ఇలా అమ్మాయిలను పట్టుకుంటూ ముద్దులు పెడుతున్న సమయంలో చుట్టూ ఉన్నవాళ్లు నీళ్ళు చల్లుతూ ఉత్సాహపరుస్తారు. ఇలా ముద్దాడిన వాళ్ళకు ఆరోగ్యం కలుగుతుందని ,ఊరికి కూడా అరిష్టం రాదని అక్కడి ప్రజల నమ్మకమట!ఈ నమ్మకం ఏమో గాని అమ్మాయిలతో ముద్దుల అవకాశం అనగానే అబ్బాయిల్లో తెగ ఉత్సాహం వచ్చిందట !అందుకే జోష్ తో ఈ వేడుకలో పాల్గొని ముద్దుల వర్షం కురిపిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: