టీవీల్లో ఇప్పుడు రాజకీయ పార్టీ ల యాడ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఏ ఛానల్ పెట్టినా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ , కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీల యాడ్సే కనిపిస్తున్నాయి. టీవీలకు ఎన్నికల సీజన్ లో బాగా డబ్బులు సంపాదించి పెట్టేవిగా మారాయి ఈ యాడ్స్. మరి ఏ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ పార్టీ ఈ యాడ్స్ ను రూపొందించుకొన్నాయి. తమకు ఓటేయాల్సిన ప్రాముఖ్యత గురించి తెలియజెప్పుతున్నాయి ఈ యాడ్స్. మరి వీటిని రూపొందించి ఎవరు? అనే విషయం గురించి ఆరాతీస్తే కొందరు సినీ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. సినీ దర్శకులు తమ క్రియేటివిటీని ధారపోసి పార్టీల కోసం ఈ యాడ్స్ ను రూపొందించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ యాడ్స్ ను రూపొందించింది రవిబాబు అని తెలుస్తోంది. హారర్ సినిమాలను తీసి మంచి హిట్స్ కొట్టి అనుభవం ఉన్న రవిబాబు తెలుగుదేశం పార్టీ యాడ్స్ ను తీశాడట. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించుకొన్నాడు. ఆ యాడ్స్ విషయంలో తనకు ప్రశంసలు అందుతున్నాయని, చంద్రబాబు నిజాయితీ పరుడైన రాజకీయ నేత అని రవిబాబు వ్యాఖ్యానించాడు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాడ్స్ లో సాక్షి టీవీ సీఈవో రామ్ వాయిస్ వినిపిస్తోంది. దర్శకుడిగా కూడా అనుభవం ఉన్న రామ్ ఆ యాడ్స్ ను తీసి ఉండచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే టీవీల్లో వైకాపా వి కొత్త యాడ్స్ వస్తున్నాయి. వీటిని తీసింది దర్శకుడు పూరి జగన్నాథ్ అని సమాచారం. పూరి వైఎస్సార్ కాంగ్రెస్ కు సన్నిహితుడిగా పేరు పొందాడు. పూరి తమ్ముడు వైకాపా తరపున ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ దర్శకుడు వైకాపా కోసం యాడ్స్ ను రూపొందించాడంటే పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక జై సమైక్యాంధ్ర పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా యాడ్స్ విషయంలో వెనుకడుగు వేయలేదు. మరి వాటిని రూపొందించింది ఎవరో యాడ్ ఏజెన్సీ వాళ్లని తెలుస్తోంది. ఈ విధంగా పార్టీలు ప్రజలను యాడ్స్ ద్వారా పలకరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: