తెలుగుదేశం పార్టీ లో ఇప్పుడు అసలు అభ్యర్థుల కన్నా రెబల్స్ సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు కూడా రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జి్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఏకంగా నలుగురు టీడీపీ నేతలు నామినేషన్లు వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో నియోజకవర్గంలో అంత మంది ఆశవహులు ఎలా తయారయ్యారు? అనేదే అంతుబట్టని అంశం మారింది. ఆఖరికి తెలుగుదేశం అనుకూల మీడియా ఇప్పుడు ఈ విషయాన్ని కవర్ చేయని తప్పని పరిస్థితి నెలకొంది. నామినేషన్ల చివరి రోజున తెలుగుదేశం పార్టీ తరపున ఇన్ని రెబెల్ నామినేష్లు పడటం, అనేక నియోజకవర్గాల్లో తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకోవడంతో అసలు అభ్యర్థుల్లో వణుకు పుట్టే పరిస్థితులు నెలకొన్నాయి. విజయవనగరం జిల్లాలో చీపురు పల్లి, కురుపాం నియోజకవర్గాల్లో బలమైన రెబల్స్ బరిలో ఉన్నారు. కర్నూలు ఎంపీ సీటు నుంచి పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ రెబెల్ గా నామినేషన్ వేశాడు. ఇదే జిల్లాలోని నందికొట్కూరులో కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన లబ్బి వెంకటస్వామికి టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రెబల్ అభ్యర్థి బరిలో ఉన్నాడు. నెల్లూరు జిల్లాలోని గూడురు, పగో జిల్లాలోని కోవూరుల్లో కూడా బలమైన రెబల్స్ ఉన్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే సీమాంధ్రలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో 30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ రెబల్స్ ఉన్నారని అంచనా. ఇంకా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆలోపల వీళ్లలో కొంతమందిని అయిన బరి నుంచి తప్పిస్తే పర్వాలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... టీడీపీ రెబల్స్ లో ఆ పార్టీ సీనియర్ నేతలు, పార్టీ తరపున చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి వారిని శత్రువులుగా చేసుకోవడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఇప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగేది ఎవరు?!

మరింత సమాచారం తెలుసుకోండి: