భారతీయ సినిమా రంగంలో మలయాళ చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం. బూతు సినిమాలనే కాదు వాస్తవికతను ఉట్టిపడే సినిమాలు నిర్మించడంలో వారితో ఎవరు పోటీ పడలేరు. మన టాలీవుడ్ లో చిన్న సినిమాల ఖర్చుతో మ‌ల‌యాళoలో పెద్ద సినిమాలను తీసేస్తారు. వారి సినిమాల బడ్జెట్ రెండు, మూడు కోట్లకు మించదు. మలయాళ పరిశ్రమలో భారీ సినిమాలు అంటే 5 కోట్ల బడ్జెట్ ను మించదు. స్టార్ హీరోలు మోహ‌న్‌లాల్, ముమ్ముట్టి లాంటి స్టార్ హీరోల‌ సినిమాల‌కు కూడ ఇదే పరిస్థితి. ఈ నేపధ్యంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సినిమాకి ఎంతైందో తెలిస్తే మన టాలీవుడ్ నిర్మాతలు షాక్ అవుతారు. ఈ సినిమాకు అయిన బడ్జెట్ 4 కోట్లు. కానీ 50 కోట్లు ఈ సినిమా వ‌సూలు చేసింది. దాంతో మ‌ల‌యాళ చిత్ర‌ప‌రిశ్ర‌మే కాదు.. యావ‌త్ దేశం షాక్‌కి గురైంది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయ‌డానికి అన్ని భాష‌ల్లోంచీ భారీ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. తెలుగులో ఈ అవ‌కాశం వెంక‌టేష్‌కు ద‌క్కింది. ఆయ‌న ఈ చిత్రాన్ని ఇక్క‌డ రీమేక్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో షూటింగ్ జ‌రుగుతోంది. వెంకీ ప‌క్క‌న క‌థానాయిక‌గా మీనా న‌టిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇదే సినిమాను కమలహాసన్ కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా విడుదలై వంద రోజులు దాటిపోతున్నా ఇంకా కేరళాలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో నడుస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. టాలీవుడ్ నిర్మాతలు ఇటువంటి సినిమాలను చూసి ఎప్పుడు పాఠాలు నేర్చుకుంటారో మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: