ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 'ఇండియాటుడే'కు చెందిన నేషనల్ చానల్ 'ఆజ్ తక్' తాజాగా సర్వే నిర్వహించిన ఫలితాలు విడుదల చేసింది. టీడీపీ - బీజేపీ కూటమి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో 17 నుంచి 21 లోక్ సభ స్దానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా మొత్తం ఓట్లలో దాదాపు 37 శాతం ఓట్లను ఈ కూటమి కైవసం చేసుకోనున్నట్లు వెల్లడైంది. ఇక వైఎస్ జగన్ పార్టీ వైసీపీ 24 శాతం ఓట్లతో 7 నుంచి 11 లోక్ సభ స్దానాలు, టీఆర్ఎస్ 6 నుంచి 10 లోక్ సభ స్దానాలు గెలుచుకోవచ్చని ఈ సర్వే వెల్లడించింది. ఇక జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఈ ఎన్నికలలో ఘోరమైన దెబ్బ తగిలే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 నుంచి 6 లోక్ సభ స్దానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఆజ్ తక్ నిర్వహించిన సర్వే లో వెల్లడైంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ - బీజేపీ కూటమికి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో విజయం తధ్యమని ఇప్పటికే జాతీయ టీవీ ఛానల్ లు నిర్వహించిన సర్వేలలో వెల్లడి అయ్యాయి. మొన్న ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో టీడీపీ- బీజేపీ కూటమికి 15 లోక్ సభ స్దానాలు వస్తాయని తేలింది. అయితే ఈ సర్వేలన్నీ బూటకమని ఇతర పార్టీలు కొట్టిపరేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: