ప్రత్యేక తెలంగాణ ఇచ్చేందుకు సోనియాగాంధీ మొదట్లో ఒప్పుకోలేదని అంటున్నారు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి. ఆమె తెలంగాణకు అనుకూలంగా మారడంలో తానొక సున్నితమైన, నిర్ణయాత్మకమైన పాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. కానీ ఆ సీక్రెట్ మాత్రం ఇప్పుడు వెల్లడించలేనని ఆయన స్పష్టం చేశారు. ‘అదేమిటో మొత్తం వివరించాలంటే కొన్ని రాజ్య రహస్యాలు వివరించాలి. వాటిని గోప్యంగా ఉంచడమే రాజ్యధర్మం. చట్టానికిచ్చే కనీస మర్యాదను ఉల్లంఘించకూడదు. కాబట్టి ఎన్నికల తర్వాత తాపీగా చెప్తాను. నేనిప్పుడే ఆ రహస్యం బయట పెడితే ప్రస్తుత ఎన్నికల్లో నాకు సొంత ప్రయోజనం ఎక్కువగానే ఉంటుంది. అయినా ఎన్నికల్లో ప్రయోజనాల కోసం కనీస మర్యాదలు ఉల్లంఘించి ఆ రహస్యాల్ని బయట పెట్టదలచుకోలేదు’ అంటూ వివరించారు జైపాల్ రెడ్డి. మరోవైపు... టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తావుని ప్రకటించిన కేసీఆర్ మాట తప్పారని, ఆయన విశ్వసనీయుత అడుగంటిందని జైపాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన వెంటనే టీఆర్‌ఎస్‌ను బేషరతుగా కాంగ్రెస్‌లో కలిపేస్తానని అప్పుడు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు అడ్డంగా ప్లేట్ మార్చారంటూ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: