తనకు 400 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయని ప్రకటించాడు వైస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ తన ఎన్నికల అఫిడవిట్ లో జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తుల వివరాలను, తనపై ఉన్న కేసుల వివరాలను జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాడు. వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని ఏ మాత్రం మొహమాటం లేకుండా ప్రకటించుకొన్నాడు జగన్ మోహన్ రెడ్డి. అలాగే సీబీఐ తనపై పెట్టిన కేసులను కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించాడు! మరి ఇప్పుడు జగన్ కార్ల గురించి మీడియాలో రాద్ధాంతం జరుగుతోంది. జగన్ తన పేరు మీద ఏ కార్లూ లేవన్నాడని, కానీ ఆయన పేరు మీద రెండు కార్లు ఉన్నాయని ఒక వర్గం మీడియాలో ప్రచారం జరుగుతోంది! మరీ రాసేవాళ్లకు ఎలా ఉందో కానీ.. వినే వాళ్లకు మాత్రం ఇదంతా చోద్యంగా కనిపిస్తోంది. తన పేరు మీద వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించుకొన్నాడు. అలాంటి బోడి రెండు కార్ల వివరాలను ఎందుకు ప్రకటించుకోడు?! వాటి విలువ అంతా అయిన కోటి రూపాయలు ఉండదు కదా..! అంతంత ఆస్తులు ప్రకటించుకొన్న వ్యక్తి ఆ ఆస్తులకు తోడు కార్ల వివరాలను కూడా ప్రకటించుకొంటే కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు! అంత చిన్న విషయంపై అవగాహన లేక జగన్ తనను తాను కార్లు లేని నిస్వార్థ పరుడిగా అభివర్ణించుకొనే పని చేసి ఉంటాడని అనుకోలేం. మరి మీడియా రాద్ధాంతం ఏమిటి? అంటే ఇదంతా కోడిగుడ్డుపై ఈకలు పీకే వ్యవహారం అని అనుకోవాల్సి వస్తుంది. జగన్ కు ఉన్నయని మీడియా చెబుతున్న కార్లు శాండూర్ పవర్ చైర్మన్ పేరు మీద ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తం శాండూర్ పవర్స్ నే తన ఆస్తిగా పేర్కొన్నాడు జగన్ మోహన్ రెడ్డి! అలాంటప్పుడు ఆ కార్లు కూడా ఆ ఆస్తిలో భాగంగానే వస్తాయి కానీ... ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదనేది ఒక వాదన. మొత్తానికి ఏదేయితేనేం... నిత్యం జగన్ పై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకొన్న మీడియా వాటిని చదివే వారి కి కూడా బీపీని పెంచేస్తోంది! ఇందుకు సాధించే ఫలితాలు ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: