ఆది వారం రోజున చంద్రబాబు పుట్టిన రోజును చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఈ ఆకేషన్ ను చాలా ఉత్సవంలా జరిపాయి. ప్రత్యేకించి ఎన్నికల మూడ్ లో ఉన్న కార్యకర్తలకు బాబు బర్త్ డే మంచి ఉత్సాహాన్ని ఇచ్చే సందర్భంగా మారింది. కార్యకర్తల, నాయకులు ఉత్సాహం ఇలా ఉంటే.. చంద్రబాబు నాయుడు కూడా ఈ పుట్టిన రోజున చాలా ఉత్సాహంగా గడిపినట్టు తెలుస్తోంది. బాబు పుట్టిన రోజు ఏప్రిల్ 20 తేదీ. ఇదే రోజున తెలుగు మీడియాలో ఆజ్ తక్ సర్వే వచ్చింది. ఆ సర్వేలో తెలుగుదేశం పార్టీ కి మంచి రేంజ్ లో సీట్లు వస్తాయని తేలింది. తెలుగుదేశం అనుకూల మీడియా ఆ సర్వేను ప్రముఖంగా ప్రచురించింది. సీమాంధ్రలోని 25 లోక్ సభ సీట్లతో తెలుగుదేశం, బీజేపీ కూటమికి 19 స్థానాల వరకూ సొంతం చేసుకొనే అవకాశం ఉందని ఆ సర్వే అంచనా వేసింది. అయితే జగన్ పార్టీని పూచికపుల్లలా తీసి పడేసింది ఆజ్ తక్ సర్వే. జగన్ పార్టీ స్థాయిని మరీ ఆరు స్థానాలకు పరిమితం చేసింది. మరి నిజంగానే అలాంటి పరిస్థిత ఉందా? లేక ఇదంతా మీడియా మాయా? అనే సందేహం సామాన్య ప్రజల్లో నెలకొంది కానీ.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం ఈ సర్వే ఫలితాలను ఫుల్ గా ఆస్వాదించాడట. ఈ సర్వే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అనే నమ్మకాన్ని కలిగిస్తోందని బాబు ఉత్సాహవంతంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వస్తే అంతకు మించిన ఆనందం లేదని , దాని కోసం ఎదురు చూస్తునట్టు, ఇప్పుడు ఎంతో ఉద్వేగంతో ఉన్నట్టు బాబు పుట్టిన రోజునాడు తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరి బాబుకు పుట్టిన రోజునాటి ఆనందం మే 16 వ తేదీన ఉంటుందా? ఆ ఆరోజు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: