హైదరాబాద్ కు చెందిన అగస్త్య రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు గురించి ఒక సర్వేను విడుదల చేసింది. ప్రత్యేకించి సీమాంధ్రలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చు? అనే అంశం గురించి ఆ సంస్థ విడుదల చేసిన నంబర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకవైపు జాతీయ చానళ్లన్నీ సీమాంధ్రలో టీడీపీ హవా అని అంటున్నాయి. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి పొత్తు కుదిరాకా జాతీయ చానళ్లు టీడీపీ రేంజ్ ను అమాంతం పెంచేశాయి. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర లో స్వీప్ చేసేస్తుంది అన్నట్టుగా ఉన్నాయి ఆ సర్వేలు. అయితే అందుకు భిన్నంగా అగస్త్యవాళ్ల సర్వే మాత్రం సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 105 నుంచి 112 అసెంబ్లీ సీట్లు దక్కవచ్చని పేర్కొంది. తెలుగుదేశం పార్టీకి 55 అసెంబ్లీ సీట్లు వరకూ వచ్చే అవకాశం ఉందని, మిగతావి కాంగ్రెస్ ఇండిపెండెట్లు దక్కించుకొనే అవకాశం ఉందని అగస్త్య సర్వే అభిప్రాయపడింది. ఈ మధ్య కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చిన సర్వే ఇది. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నట్టుగా ఉంది ఈ సర్వే. ఎంపీ సీట్ల విషయానికి వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ కు 15 నుంచి 18 సీట్లు భారతీయజనతా పార్టీ కూటమికి 5 నుంచి 8 సీట్లు కాంగ్రెస్ కు 0 నుంచి 1 సీటు దక్కే అవకాశం ఉందని అగస్త్య అంచనా వేసింది. ఇదే సమయంలో ఇతర సర్వేలకు భిన్నంగా ఉంది ఈ సర్వే. తెలుగుదేశం పార్టీకి 19 ఎంపీ సీట్లు దక్కుతాయన్న ఆసర్వే మాత్రం ఆ పార్టీ శ్రేణులను కొంత ఆనందానికి, కొంత గందరగోళానికి గురి చేస్తోంది. టీడీపీ మరీ ఆ స్థాయిలో స్వీప్ చేసేస్తుంది అనడం ఆందమే అయినా.. .మరీ ఆ స్థాయిలో చేస్తుందంటే మాత్రం టీడీపీ ఫ్యాన్సే నమ్మలేని పరిస్థితి. మరి ఇటువంటి నేపథ్యంలో అగస్త్య సర్వే కూడా వారి దృష్టిలోకి వస్తుందని అనుకోవచ్చు. మరి ఇంతకీ పరస్పరం భిన్నంగా ఉన్న ఈ సర్వేల్లో ఏది నిజం అవుతుందో ఏది అబద్ధం అవుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: