రాష్ట్ర విభజన పరిణామాలు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని దుంపనాశనం చేశాయి. సీమాంధ్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయంతో రాష్ట్రం విడిపోయింది. దీని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అనేక నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలు వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలంటే కాంగ్రెస్ ను వీడకతప్పని పరిస్థితుల వల్ల నేతలు కాంగ్రెస్ ను వీడారు. అయినప్పటికీ చచ్చి చెడి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టుకొంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకలేదు కానీ... చాలా చోట్ల అయితే అభ్యర్థులను నిలబెట్టి పరువు నిలుపుకొంది. మరి ఇప్పుడు ఆ అభ్యర్థుల్లో ఎంతమంది గెలుస్తారు? అని అంటే... కనీసం డిపాజిట్లు దక్కితే అదే చాటు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ క్యాండిడేట్లకు సొంతంగా ఉన్న బలం వల్ల డిపాజిట్లను సంపాదించుకోవచ్చేమో కానీ... కాంగ్రెస్ పార్టీకి అయితే సొంతంగా బలం లేదని, పొరపాటు కూడా ఇప్పుడు సీమాంధ్ర జనాలు హస్తం గుర్తుకి ఓటు వేసే పరిస్థితి లేని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ సీమాంధ్ర కాంగ్రెస్ కి ఒక నియోజకవర్గం మీద ఆశ ఉందట. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ వాళ్లు అంటున్నారు. అదే చీపురుపల్లి నియోజకవర్గం. విజయనగరం జిల్లాలోని ఇక్కడ నుంచి పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ కు వ్యతిరేక పవనాలు తీవ్రంగా ఉన్న ఇప్పుడు కూడా ఆయన గెలిచే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. మరి బొత్స నిజంగానే గెలుస్తాడా?! ఆయనకు అంత సీన్ ఉందా?! అనేవి సందేహాస్పదమైన విషయాలే

మరింత సమాచారం తెలుసుకోండి: