మొన్నేమో కాంగ్రెస్ ది అవినీతి వాదం, బీజేపీది అరాచకవాదం.. అని అందరినీ ఆశ్చర్యపరిచింది నందమూరి నటసింహం. స్వయంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో బాలయ్యకు ఆహ్వానం పంపాడు. ఇప్పుడు రాష్ట్రంతో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. మరి ఈ విషయంపై అవగాహన లేదో లేక నోరు జారాడో కానీ బాలయ్య భారతీయ జనతా పార్టీ ని అరాచకవాదిగా అభివర్ణించాడు. అది ఫ్లోలో జరిగిన పొరపాటు అని అనుకొని సమాధానపడితే.. ఇప్పుడు హిందూపురం నుంచి శ్రీకాకుళం వెళ్లిన నందమూరి నటసింహం అక్కడ మరోసారి నోరు జారాడు. జనాలను చూసి ఉత్సాహంగా మాట్లాడుతున్న బాలయ్యా ఫ్లోలో "చంద్రబాబుదే అధికారం...' అనబోయి "జగన్ దే అధికారం..'' అని అన్నాడు! దీంతో వినేవాళ్లు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇది బాలయ్య ప్రసంగంలో దొర్లిన మరో తప్పు! ఇవి మాత్రమే కాదు.. బాలయ్య ప్రసంగం తాగే ముందు సెవెన్ అప్ తాగాలి. ఎందుకంటే సూటిగా మాట్లాడటానికి. బాలయ్య మదిలో చాలా పదసంపద ఉంది. అయితే దాన్ని ఉపయోగించుకోవడమే ఆయనకు సాధ్యం కావడం లేదు. శ్రీకాకుళం జిల్లాల్లో ఆయనకు "ఎస్సీలు'' అనే పదం అస్సలు గుర్తు రాలేదు. తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్సీల జాబితాలోకి చేరుస్తాం.. అని చెప్పడానికి బాలయ్య చాలా తంటాలు పడ్డాడు. "అదేందదీ, అదేందదీ...' అంటూ ఎస్సీ అనే పదాన్ని గుర్తుతెచ్చుకోవడానికి ప్రయాసపడ్డాడు. చివరకు గుర్తొచ్చి మత్స్యకారులను ఎస్సీలనుచేస్తామని వాక్యాన్ని ముగించాడు. మరి బాలయ్య ప్రసంగంలో ఇలాంటి పొరపాట్లు దొర్లనీయకుడదూ అంటే.. కాస్తంత హోమ్ వర్క్ చేసుకోవడమే మార్గం. ప్రసంగానికి ముందు ఒకటీ రెండు సార్లు ప్రాక్టీస్ చేసుకొంటే ఈ ప్రాబ్లమ్ ఉండదని చెప్పవచ్చు. మరి నందమూరి నటసింహానికి రిహార్సల్స్ చేసేంత ఓపిక ఉందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: