ఏ చిన్న వివాదంపై నైనా ఏకంగా 14 న్యూస్ చానళ్లు కెమెరాలు ఎక్కుపెడతాయి. అవకాశం దొరికితే చీల్చి చెండడతాయి. అది అనుకూల పరిస్థితి గురించి మాత్రం ఏ ఒక్క ఛానల్ కూడా ప్రసారం చేయదు. అవతలి పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారవుతున్నా.. ఆ పార్టీని వెనకేసురావడానికి, వెలిగిపోతోంది అంటూ అనుకూల సర్వేలను ప్రచారంలోకి తీసుకురావడానికి మీడియా అండ ఉంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మీడియాకు టార్గెట్ అవుతోంది. అక్కడికీ జగన్ మోహన్ రెడ్డికి సొంతం సాక్షి పేపర్ , సాక్షి టీవీ చానల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే.. ఈ పాటికి అసలు జగన్ అనే వ్యక్తి ఒకరు ఉన్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉందని కూడా ఏపీ ప్రజలకు తెలిసేది కాదు. అయినా జగన్ తరపున సాక్షి ఒంటరిపోరాటం చేస్తోంది. అయితే వైకాపాలోచీమ చిటుక్కుమన్నా 14 న్యూస్ చానళ్లు రెండు పెద్ద పత్రికలు నానా హైరానా చేస్తాయి. ఒకవేళ నామినేషన్ల కోలహాలంలోనూ, బీజేపీతో పొత్తు వ్యవహారంలోనూ తెలుగుదేశం పార్టీలో రేగిన వంటి వివాదాలే వైఎస్సార్ కాంగ్రెస్ లో గనుక రేగి ఉంటే... నిజంగా వైకాపా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. తెలుగుదేశం నేతల మధ్య విభేదాలున్నట్టుగా, తెలుగుదేశం నేతలు తన్నుకొన్నట్టుగా వైకాపా వాళ్లు తన్నుకొని ఉంటే... వైఎస్సార్ కాంగ్రెస్ ను మరో ప్రజారాజ్యం పార్టీల చూపించేది మీడియా. జగన్ మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉండి. అభ్యర్థులను ప్రకటించుకొని రెబల్స్ పోటు లేకుండా చేసుకొన్నాడు. జగన్ లో ఇలాంటి టాలెంట్ లేకపోతే.. మీడియా చేతిలోవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలి అయ్యేది. మరి తెలుగు మీడియాకు మొత్తం ఇప్పుడు వైకాపాలోని లోపాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి అనుకూలంశాల గురించి ఏ మీడియా వర్గం కూడా ప్రచారం చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే మీడియా అనుకూలంగా నిలిచినంతమాత్రాన పార్టీలు గెలిచేస్తాయని చెప్పడాని లేదు. దీనికి గతంలోని అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇదే వైకాపాకు కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: