సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన సోదరుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సహా పలువురు తెలంగాణలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు చిరు మాత్రం తెలంగాణలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండేందుకు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార బాధ్యతలు ఓ కారణమైనప్పటికీ తెలంగాణ ఏర్పాటు అంశంలో ఆయన వ్యవహరించిన తీరే అందుకు కారణమని చెప్పవచ్చు ఈ కారణంగానే కాంగ్రెసు పార్టీ ఆయనతో కర్నాటకలోను రెండు ఎన్నికలలో ప్రచారం చేయించింది.  అయితే, అదే చిరంజీవి తనకు అభిమానులు ఎక్కువగా ఉండే తెలంగాణలో మాత్రం ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ మోడీతో కలిసి ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. బిజెపి తరఫున ప్రచారానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మోడీతో పవన్ రెండు సభల్లో మంగళవారం పాల్గొంటున్నారు. హీరో రాజశేఖర్ ఆయన సతీమణి బిజెపి నేత జీవిత కూడా తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. బిజెపి తరఫున వారు ప్రచారం చేయనున్నారు. అయితే, మొదటి నుండి విజయశాంతి తెలంగాణ కోసం ఉద్యమిస్తుండటం గమనార్హం. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన సామాజిక తెలంగాణ అన్నారు. కాంగ్రెసు పార్టీలో పిఆర్పీని విలీనం చేశాక అధిష్టానం నిర్ణయమన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చాక తాను వ్యక్తిగతంగా సమైక్యవాదనని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: