హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతో కలిసి ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. తాను ఐటిని అభివృద్ధి చేశానని నరేంద్ర మోడీకి సాంకేతిక పరిజ్ఞానం అపారంగా ఉందని ఆయన అన్నారు పదేళ్ల కాంగ్రెసు పాలన దేశాన్ని భ్రష్టు పట్టించిందని ఆయన అన్నారు. అవినీతి కారణంగా దేశం దెబ్బ తినే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. మోడీ అధికారంలోకి వస్తే తప్ప ఉద్యోగాలు రావని ప్రజలు అనుకుంటున్నారని మోడీ రావాలి దేశం బాగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.  తెలంగాణ జిల్లాలో తమకు మద్దతుగా యువత ముందుకు వస్తోందని ఆయన అన్నారు బిజెపి తెలుగుదేశం అధికారంలోకి రావాలని తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న యువత ముందుకు వస్తోందని ఆయన అన్నారు. ఎన్డియె సహకారంతో హైదరాబాదును అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు తెరాస మూడో కూటమి గురించి మాట్లాడడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. మనం చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణ వచ్చిందని, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగుజాతి కలిసి ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: