టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును గతం వెంటాడుతోంది. ఆయన తొమ్మిదేళ్ల పాలనలోని చేదు సత్యాలను విమర్శకులు గుర్తు చేస్తున్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి ఐటిపైనే మక్కువ కనబరచిన చంద్రబాబుకు ఇప్పుడు హఠాత్తుగా వ్యవసాయం, వ్యవసాయాధారిత పరిశ్రమలపై ప్రేమ పుట్టుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రతి చోట రైతులకు ఉచిత విద్యుత్, వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం గురించే ఆయన మాట్లాడుతున్నారు. తన సొంత జిల్లా చిత్తూరులో సహకార డైరీని నాశనం చేసింది చంద్రబాబేనని ఆయన విమర్శకులు గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన వ్యవసాయాన్ని ఏ స్థితికి తీసుకెళతారోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు పాల డైరీని మూయించి పాల వ్యాపారాన్ని కార్పొరేట్ చేసిన చంద్రబాబు వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాలలో బెల్టు షాపులను బంద్ చేస్తానంటున్న చంద్రబాబు కిలో రెండు రూపాయల బియ్యంపై ఇచ్చిన హామీకి పట్టించిన గతే దీనికి కూడా పట్టిస్తారేమోనని వారు విమర్శిస్తున్నారు. తాను మారిన మనిషినంటున్న చంద్రబాబు మాటలను జనం విశ్వసిస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: