ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి దిగిన జగన్ మనసులో ఉన్నదేమిటి. ఎన్నికల తర్వాత ఆయన ఇలాగే ఎవరితో కలవకుండా ఉంటారా, లేక అవసరాన్ని బట్టి మారుతారా అన్న సందేహాలు ఎప్పటి నుంచి ఉన్నమాట నిజం. అయితే తాజాగా ఆయన ప్రచారపర్వంలో చేసిన వాఖ్యలు ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాయి.మేకపోటి రాజమోహన్ ను గెలిపించండి, ఆయనను మీకు మంత్రిగా చూపిస్తాను, అన్నారు. దీని భావమేదో అక్కడున్న వారికి బోదపడలేదు. ఎందుకంటే మేకపాటి పోటీ చేస్తున్నది లోక్ సభకు. అసెంబ్లీకి అయితే ఎలాగు తాను సీమాంద్రలో అధికారంలోకి వస్తాను, రాగానే ఆయనకు మంత్రి పదవి ఇస్తాను అంటే సందేహాలు కలిగేవి కాదు. కేవలం రాష్ట్రానికే పరిమిమితమైన జగన్ కేంద్ర మంత్రి పదవి ఎలా ఇస్తారు అంటే ఎవరికైనా మదిలో మెదిలేదేమిటి. రేపటి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవుతాడనే కదా. అలాంటప్పుడు ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి కదా అంటారు. కాని ఈ పార్టీనే కేంద్రంలో అధికారానికి వస్తుంది అని చెప్పలేం కాబట్టి ఆయన అవకాశం కాచుకుని కూర్చున్నాడు అన్నది క్లియర్ అయింది. అంటే రేపు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ పార్టీతో జగన్ కలిసిపోతాడన్నది మాత్రం వెరీ క్లియర్. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు సీమాంద్రలో ఆయనకు ప్రధాన ప్రత్యర్థి టడిపి. అంటే టిడిపి, బిజేపిలో పొత్తు కాబట్టి, ఆ రెండు పార్టీలకు జగన్ కూడా ప్రధాన ప్రత్యర్థి. రేపు కేంద్రంలో అధికారానికి వచ్చే అవకాశం బిజేపి నేతృత్వంలోని ఎన్డీఏకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు జగన్ ఇప్పుడు కొట్లాడిన పార్టీతో అప్పుడు పొత్తు ఎలా పెట్టుకుంటారు అన్నది ఓ సందేహం. సరే రాజకీయాల్లో ఇవన్నీ ఎవరు చూసుకోరు, అవసరాన్ని బట్టి బిజేపి జగన్ తో స్నేహం చేస్తారని ఆయన భావించడంలో తప్పులేదు. ఇలా ఆలోచిస్తున్నారా, లేక బిజేపికి అధికారంలోకి వచ్చే అవకాశం లేదనుకుంటున్నారా అన్నది కూడా ఆయన ఆలోచనేమో అంటున్నారు. ఎందుకంటే టిడిపికి ఇక భవిష్యత్తులో కూడా సీమాంద్రలో జగన్ పార్టీనే ప్రధాన ప్రత్యర్థి. అధికారం కోసం ఇక ముందు కూడా చంద్రబాబు జగన్ లమద్యే పోటీ ఉంటుంది. అలాంటప్సుడు చంద్రబాబు రేపు బిజేపికి జగన్ మద్దతిస్తానంటే ఒప్పుకుంటారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈ కోణంలో జగన్ ఆలోచించిస్తే ఆయన మదిలో బిజేపి అధికారంలోకి రాదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏనో, లేక మూడో ఫ్రంటో వస్తుందని భావిస్తూ ఉండాలి. అలాంటప్పుడే ఆయనకు కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యం చాలా ఈజీ. అలా కాక ఈ సారి జగన్ సీమాంద్రలో టిడిపిని చిత్తు చేస్తే అప్పుడు బిజేపి అధికారం కోసం తప్పనిసరిగి బాబును వదిలి తనతో ఫ్రెండ్షిప్ చేస్తుందని అనుకుంటున్నారా. వీటిలో ఏది నిజమైనా జగన్ మాత్రం అవకాశం కోసం రెడీగా ఉన్నాడన్నది మాత్రం అక్షరాల నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: