గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం ముగిసింది మోడీ ఏపీ వస్తున్నాడంటే ఏదో బ్రహ్మండం బద్ధలవుతుందని ఎక్స్ పెక్టేషన్లు పెట్టుకొన్న వాళ్లకు నిరాశే మిగిలింది కానీ.. రొటీన్ గా మోడీ వస్తున్నాడు అనుకొన్న వాళ్లకు సభలు సక్సెస్ కావడంతో ఆనందం కలిగింది. ఇక ఈ సభల్లో మోడీతో పాటు రెండు పార్టీల అధ్యక్షులు, ఏపీలో పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్లు కలిసి కూర్చోవడమే చాలా మందిలో ఆసక్తిని రేపింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే వేదిక మీద దర్శనమివ్వడం అటు టీడీపీ శ్రేణులకు, పవన్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సభలో మోడీ ప్రసంగంలో చంద్రబాబును పొగడకపోవడం, పవన్ కల్యాణ్ ను మాత్రమే మోడీ పొడగటం వైరి వర్గాలకు అస్త్రంగా మారింది. కాంగ్రెస్ ను, టీఆర్ఎస్ లను విమర్శించిన మోడీ చంద్రబాబును పొగడకపోవడం తెలుగుదేశం శ్రేణులకు నిరాశను కలిగించింది. ఇక పవన్ కల్యాణ్ అయితే చంద్రబాబును పొగడనే లేదు! ఆయన మోడీని పొగిడిడాడు అంతే. ఇదంతా ఇలా ఉంటే.. మోడీ మళ్లీ ఏపీ కి వస్తాడు. ఏప్రిల్ 30 వ తేదీతో తెలంగాణలో ఎన్నికలు ముగుస్తాయి. ఆ తర్వాత వారం రోజుల్లో సీమాంధ్రలో ఎన్నికలు ఉంటాయి. ఆ సమయంలో సీమాంధ్రలో ప్రచారంలో కోసం మోడీ వస్తాడు. మరి ఆప్పుడు మోడీ జగన్ ను విమర్శిస్తాడా? విమర్శించడా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో మోడీ టీఆర్ఎస్ కడిగేశాడు. మరి సీమాంధ్రలో? కేవలం కాంగ్రెస్ ను మాత్రమే విమర్శిస్తాడా? లేక జగన్ ను కూడా టార్గెట్ చేసుకొంటాడా?! సీమాంధ్రలో కాంగ్రెస్ చచ్చిన పాము. అలాంటి కాంగ్రెస్ ను విమర్శించడానికి మోడీ రావాల్సిన అవసరం లేదు. మరి మోడీ తెలుగుదేశాన్ని, బీజేపీని గెలిపించాలని జనాలను కోరేటట్టు అయితే జగన్ ను విమర్శించాల్సి ఉంటుంది. అలా విమర్శిస్తే...మళ్లీ రేపు ఎన్నికలు అయ్యాకా జగన్ అవసరం పడితే ఎలా? అనేది బీజేపీ వాళ్ల టెన్షన్. ఒకవేళ ఆ టెన్షన్ తో మోడీ గనుక జగన్ ను విమర్శించకపోతే తమ గాలి పోతుందని తెలుగుదేశం వాళ్లు భయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: