ఎన్నికల తేది సమీపిస్తున్న కొద్ది, రాజకీయ నాయకుల ప్రచార జోరు పెరుగుతుంది. ప్రత్యర్ధులపై విమర్శల వర్షం స్పీడ్ అందుకుంది. తాజాగా తల్లవేరు, కాజులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి చిరంజీవిపై నిప్పులు చెరిగారు. ఎన్నో ఆశలతో ప్రజలు తనను గెలిపిస్తే, ఆ ప్రజలనే చిరంజీవి మోసం చేశాడని విమర్శించారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి దాదాపు 70 లక్షల మంది ఓటు వేసి, 18 మంది ఎంఎల్ఏలను గెలిపిస్తే, చిరంజీవి ప్రజలను పటించుకోలేదని, తనను గెలిపించిన ప్రజలనే మోసం చేసి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడని విజయమ్మ విరుచుకుపడ్డారు.  అంతేకాకుండా, విజయమ్మ ఈ సందర్బంగా మాట్లాడుతూ ‘జై సమైఖ్యాంధ్ర’ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరియు తెలుగుదేశం అధినేత చంద్రబాబులపై కూడా ఫైర్ అయ్యారు. విభజన జరిగిన అనంతరం, వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏలు అందరూ రాజీనామా చేశారని, మిగతా వారిని కూడా రాజీనామా చేయమని కోరగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ అడ్డుకున్నారని తెలిపారు. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేస్తూ 1950లో మూడవ స్థానంలో ఉన్న హైదరాబాద్ ను ఐదవ స్థానానికి దిగాజర్చాడని అన్నారు. స్థానిక మత్స్యకారులకు ఇబ్బంది కలిగించిన రిలయన్సు వంటి చమురు కంపెనీల గురించి విజయమ్మ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడం మత్స్యకారులను అసంతృప్తికి గురి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: