రెండు రకాల సర్వేలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఒక సర్వేలోనేమో తెలుగుదేశం పార్టీ స్వీప్ చేస్తుందని అంటున్నారు. రెండో దాంట్లోనేమో వైఎస్సార్ కాంగ్రెస్ దే హవా అని స్పష్టం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఈ రెండు సర్వేలూ ఎక్స్ ట్రీమ్ గా ఉన్నాయి. అంటే ఎవరో ఒకరికి కనీస మెజారిటీ వస్తుందని గాక... పూర్తి స్థాయిలో అన్ని సీట్లూ సొంతం చేసుకొంటాయని సర్వేల్లో పేర్కొంటున్నారు. జాతీయ మీడియాలో తెలుగుదేశం పార్టీ అనుకూల సర్వేలు వస్తున్నాయి. వాటిల్లో క్రమంగా టీడీపీ సీట్ల సంఖ్య ను పెంచేశారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీల కూటమికి సీమాంధ్రలో ఏకంగా 19 ఎంపీ సీట్లు దక్కుతాయని ఆ సర్వేలో చెబుతున్నారు! అంటే జగన్ పార్టీ కేవలం ఆరు ఎంపీ సీట్లకు పరిమితం అవుతుందని ఆ సర్వేల సారాంశం. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఆ సర్వేల్లో పేర్కొంటే కొంత వరకూ నమ్మశక్యంగా ఉంటుంది. అయితే మరీ అంత గొప్ప విజయం సొంతం అవుతుందంటే మాత్రం నమ్మలేని పరిస్థితి. మరి ఏం జరిగిందో ఏమోకానీ వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రముఖ సంస్థలేవీ సర్వేలను వెళ్లడించడం లేదు. ఒక దశలో జాతీయ మీడియా జగన్ జగన్ అని కలవరించేది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీలు దగ్గరయ్యాయో అప్పటి నుంచి జాతీయ మీడియా జగన్ కు ప్రాధాన్యత తగ్గించేసింది. అప్పటికే మోడీ దండకం అందుకొన్న మీడియా ఏపీలో కూడా మోడీ, టీడీపీల హవా ఉంటుందని తేల్చేసింది. ఒకదశలో మోడీ ఆధ్వర్యంలోని బీజేపీకి 200 సీట్ల వరకూ వస్తాయన్న మీడియా ఇప్పుడు ఆ స్తాయిని 275 కు పెంచేసింది! అదే పరంపరలో ఏపీలో కూడా బీజేపీ, టీడీపీల రేంజ్ ను పెంచేస్తూ తమ నంబర్ గేమ్ లో తమ స్థాయిని అమాతం తగ్గించేసింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా కొన్ని సర్వేలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆ సర్వేల్లోనేమో వైకాపా అధికారం సొంతం చేసుకొంటుంది. ఏకంగా 120 అసెంబ్లీ స్థానాల వరకూ సొంతం చేసుకొంటుంది.. అనే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ విధంగా పరస్పర విరుద్ధంగా, అది కూడా ఒక్కో పార్టీకి పూర్తిగా అనుకూలంగా వెల్లవడుతున్న ఈ సర్వేల ఫలితాల్లో ఏవి నిజం అవుతాయో, ఏవి అబద్ధమవుతాయో!

మరింత సమాచారం తెలుసుకోండి: