జనసేన ఆవిర్భావ సభలో తను ఆవేశంతో రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నాడు. కోపం వచ్చి పార్టీ పెట్టానని అన్నాడు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరుచుకుపడుతూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఎవరితోనైనా తాను జతకడతానని పవన్ ప్రకటించాడు. అయితే రెండో సభ సమయానికల్లా పవన్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. మరి పవన్ రాజకీయ ప్రస్థానం కమలంతో కలిసి సాగుతుందని అనుకొంటే... అంతలోనే ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ జగన్ పై విరుచుకుపడ్డాడు. అదే ఇంటర్వ్యూలో చంద్రబాబును ఆకాశానికెత్తేశాడు. బాబును ఒక దార్శానికుడిగా అభివర్ణించాడు పవన్ కల్యాణ్. ఆఖరికి బషీర్ బాగ్ ఉదంతంలో కూడా పవన్ బాబును వెనకేసుకొచ్చాడు. ఆసమయంలో ప్రభుత్వానిది కాదు తప్పు ఉద్యమాకారులదేనని పవన్ వ్యాఖ్యానించాడు. మరీ అలా మాట్లాడటం, అన్ని విషయాల్లోనూ బాబును సమర్థించడం తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని గ్రహించలేదో ఏమోకానీ పవన్ మాత్రం అప్పటికి చంద్రబాబును తెగపొగిడేశాడు. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ మీడియా ఇంటర్వ్యూలో బాబును కీర్తించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత ఎప్పుడూ చంద్రబాబును పొగడలేదు. బాబును కీర్తిస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు రాలేదు. సభలు పెట్టి చంద్రబాబును కీర్తించలేదు. బీజేపీ వాళ్లతో కలిసి ఏర్పాటు చేసిన సభలో కూడా పవన్ మోడీని పొగిడాడు కానీ... చంద్రబాబు విధానాలను ప్రస్తావిచంలేదు! మరి పవన్ తీరు, ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన తీరు ఇప్పుడు సందేహస్పదంగా మారింది. పవన్ తెలుగుదేశం అధినేతను పొగిడేది కేవలం న్యూస్ పేపర్లలో మాత్రమేనా? ప్రజలు ప్రత్యక్ష్యంగా చూస్తున్నప్పుడు ఆయన బాబును పొగడడా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి. మరి దీనికి పవన్ ఫ్యాన్స్ వివరణ ఇస్తారా? తెలుగుదేశం వాళ్లు సమాధానం చెబుతారా!

మరింత సమాచారం తెలుసుకోండి: