2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికల్లో ప్రచారానాకి ముందుకు రాకపోవడానికి కారణాలు పార్టీలో అంతర్గత పోరులే కారణమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్టీఆర్ పైన తెలుగుదేశం పార్టీ నేత హీరో నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. బుధవారం బాలకృష్ణ విజయనగరంలో ప్రచారం నిర్వహించారు. పార్టీ తరఫున ప్రచారం చేయాలని తాము ఎవరినీ పిలవలేదన్నారు. ఎవరి పైన ఒత్తిడి తీసుకురామన్నారు. పార్టీ పైన అభిమానం ఉంటే వారే వచ్చి ప్రచారం చేస్తారన్నారు. తాను తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నియోజకవర్గం రాజంపేటలో ప్రచారం చేయడం లేదని చెప్పారు.  హిందూపురం నుండి తాను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పారు. చంద్రబాబు సోదరుడి కుమారుడు హీరో నారా రోహిత్ టిడిపి తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25న గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో, 26న విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 27న అనంతపురం తిరుపతిలలో ఆయన ప్రచారం చేయనున్నారు. మా ప్రభుత్వాలే చంద్రబాబు రెండు రాష్ట్రాల్లో టిడిపి బిజెపి ప్రభుత్వాలే ఏర్పడతాయని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమాజానికి ఏదో చేయాలన్న తపన పవన్‌లో ఉందని ఎన్నకల ప్రచారంలో సహకారం కోరేందుకు పవన్‌ను కలిశానని ఆయన తెలిపారు. మోడీ పవన్ తనది ఒకటే ఆలోచన అని దేశం బాగుపడాలన్నదే తమ తపన అని తెలిపారు. బాబాయి అబ్బాయిల మధ్య పొరపచ్చాలు రావడంతో ఈ సారి ఎన్నికల ప్రచారానికి జూ.ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. అంతేకాక నారా లోకేశ్ ను ముందుకు తీసుకు రావడంతో ఎన్టీఆర్ అభిమానుల్లో కాస్త నిరుస్సాహంగా ఉన్నారని తెలిసింది. ప్రచారానికి దూరంగా ఉండటం ఇదికూడా ఒక కారణం కావచ్చేమో అని పలువురు అనుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: