పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరును చూస్తుంటే ఒక ఆసక్తికరమైన విషయం అర్థం అవుతుంది. జగన్ తను అనుకొన్న లక్ష్యం కోసం కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి తప్ప మరో జీవితో తను పోరాటం చేయడం అనవసరం అని భావిస్తున్నట్టుగా ఉన్నాడు. ఇన్ని రోజులు ఆయినా జగన్ కేవలం చంద్రబాబు మీద మాత్రమే విమర్శలు చేశాడు. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసుకొన్నాడు. అంతే తప్ప తన మీద అనేక రకాలుగా విమర్శలు చేసిన టీఆర్ ఎస్ వాళ్లను కానీ, కాంగ్రెస్ నేతలను గానీ, తనను అవినీతి పరుడని అభివర్ణించిన జనసేన పవన్ కల్యాణ్ ను కానీ ఏ రోజూ జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ గా చేసుకోలేదు. ఒకనొక దశలో కిరణ్ కుమార్ రెడ్డి ని జగన్ మోహన్ రెడ్డి విమర్శించాడు. కిరణ్ సమైక్యవాదినని హైలెట్ కావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో జగన్ కిరణ్ గురించి స్పందించాడు. కిరణ్ కు చిత్తశుద్ధి లేదని విమర్శించాడు. ఇక కాంగ్రెస్ లో ఏ ఒక్క నేతనూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకోలేదు జగన్ మోహన్ రెడ్డి! మరి ఈ స్ట్రాటజీ కొంచెం చిత్రంగానే ఉంది. ఒకవైపు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళితే అక్కడ లోకల్ లీడర్లను కూడా వదలడు. వాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ చంద్రబాబు టార్గెట్ చేస్తాడు. విజయనగరం వెళితే బొత్సను విమర్శిస్తాడు. శ్రీకాకుళం వెళితే ధర్మాన సోదరులను టార్గెట్ చేస్తాడు. ఇలా ఆయా జిల్లాల్లోని తన ప్రత్యర్థులపై చంద్రబాబు విరుచుకుపడుతూ ఉంటాడు. ఇక ఇప్పటి వరకూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై కూడా జగన్ నోరు విప్పలేదు. పవన్ తనను వ్యక్తిగతంగా విమర్శించినా, అవినీతి పరుడు అని అన్నా జగన్ పవన్ ను పల్లెత్తుమాట అనలేదు. కనీసం వ్యంగ్యంగా కూడా పవన్ విషయంలో స్పందిచంలేదు. పవన్ సమాధానం చెప్పేంత దిగజారుడు స్థితిలో తాను లేను అనే భావనను కలిగిస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి. మాట్లాడితే వైఎస్ విధానాల గురించి మాట్లాడటం. లేకపోతే చంద్రబాబును విమర్శించడం.. ఇలాగే కొనసాగుతోంది జగన్ మోహన్ రెడ్డి ప్రచార పర్వం. మరి ఎన్నికలు పూర్తి అయితే గానీ జగన్ ది ఏ మేరకు సక్సెస్ ఫుల్ ఫార్ములానో అర్థం కాదు!

మరింత సమాచారం తెలుసుకోండి: