ఆళ్ళగడ్డ నుంచి వైసీపీ అభ్యర్ది గా పోటీ చేస్తున్న భూమా శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు. ఆళ్ళగడ్డ మండలం గూబగుండ్లమెట్ట వద్ద ఆమె ప్రయాణిస్తున్న వాహనం నాలుగు పల్టీలు కొట్టడం తో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పైన ధాన్యం ఎక్కించడం తో ముందు సీటులో కూర్చున్న ఆమె తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఎన్నికల ప్రచారం ముగించుకొని ఆళ్ళగడ్డ లోని తన స్వగృహానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం శోభానాగి రెడ్డి కి నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. శోభా నాగిరెడ్డి మెడ భాగంలో గాయాలు అయినట్లు సమచారం. ఆమె తో పాటు ప్రయాణిస్తున్న ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త భూమా నాగిరెడ్డి తన కార్యకర్తలతో కలిసి హుటాహుటిన నంద్యాల చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను కర్నూల్ లేదా హైదరాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాత్రి 11. 40 నిమిషాల సమయం లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆమె టీడీపీ తరుపున ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏపీయస్ ఆర్టీసీకి రెండేళ్ళ పాటు చైర్ పర్సన్ గా సేవలు అందించారు. తరువాత టీడీపీలో కొంత ముసలం తో ఆమె చిరంజీవి స్దాపించిన ప్రజారాజ్యం లో చేరారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం తో వైయస్ మీద ఉన్న అభిమానం తో వైసీపీ లో చేరి, 2009 లో జరిగిన ఉపఎన్నికల్లో ఆమె వైసీపీ ఎమ్మెల్యే గా గెలుపొంది, ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. శోభానాగిరెడ్డి మాజీ మంత్రి అయిన ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె.

మరింత సమాచారం తెలుసుకోండి: