రోడ్డు ప్రమాదంలో గాయపడిన వైఎస్సాఆర్ సీపీ అగ్రనేత శోభానాగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఆమె గురువారం ఉదయం. 11.05 గంటలకు లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ విషయం కేర్ ఆసుపత్రి వైద్యులు ద్రువీకరించారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు,అభిమానులు పార్టీ నాయకులు ముఖ్యంగా వైఎస్సార్ సీపీ నేత జగన్, విజయమ్మలు షాక్ గురయ్యారు. ఇలాంటి నాయకురాలు మళ్లీ రారు అని కన్నీటి పర్యంత అయ్యారు. శోభానాగిరెడ్డి  1968 నవంబర్‌ 16న ఆళ్లగడ్డలో జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె అయిన శోభ ఇంటర్ వరకు చదివారు. 1986లో ఆమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత వ్యవహరించారు. రాజకీయంగా ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ పార్టీలో చేరి ఆమె వెఎస్సార్ సీపీలో ముఖ్యనేతగా అందరి మన్ననలు పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: