పార్టీకి మద్దతిస్తాను అని ప్రకటిస్తే ఒక విధంగా నవ్వుల పాలవుతాడు.. తాత పెట్టిన పార్టీలో కట్టె కాలే వరకూ ఉంటాను.. అని అంటే మరో విధంగా అభాసుపాలవుతాడు...ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఇది. మరి ఆయన ఎలాంటి స్టాండు తీసుకొంటాడో కానీ.. ఏది తీసుకొన్న జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో చిక్కిన పోకవక్కలా తయారైంది. తెలుగుదేశంలో జూనియర్ ఎన్టీఆర్ కు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదు అనేది వాస్తవం. జూనియర్ ఎన్టీఆర్ పై బాలకృష్ణ మాట్లాడుతున్న మాటలు... చూస్తే చాలు తెలుగుదేశంలో ఎన్టీఆర్ కు ఎలాంటి ట్రీట్ మెంట్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. తాము ఎవరినీ బొట్టు పెట్టి ప్రచారానికి పిలవం అని బాలయ్య అంటున్నాడు. ఇక హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ తరపున టికెట్ దొరకకపోడం కూడా ఎన్టీఆర్ పరిస్థితికి అద్దం పడుతోంది. హరికి రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడం, హరి ముందుగా వెళ్లి హిందూపురం అసెంబ్లీ సీటు ను అడిగితే అదే సీటు నుంచి బాలయ్య అభ్యర్థిత్వాన్ని బాబు ఖరారు చేయడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెక్ పెట్టాడనే ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ ను అవమానించే మాటలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ గనుక బాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తే ఇప్పుడు టీడీపీ కి అది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఒకవైపు పవన్ కలిసొచ్చాడని మురిసిపోతున్న టీడీపీ వాళ్లకు ఇప్పుడు ఎన్టీఆర్ గనుక పానకంలో పుడకగా మారితే అంతే సంగతులు. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే ఒక విషయాన్ని స్పష్టం చేశాడు. నేను కట్టకాలే వరకూ తాతపెట్టిన పార్టీలోనే ఉంటానని ఎన్టీఆర్ అన్నాడు. మరి అదే విధంగా ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అయితే... అంతగా అవమానించిన ఎన్టీఆర్ టీడీపీలోనే ఉన్నాడు చూశారా.. అనే విశ్లేషణలు వినిపిస్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ మీడియా ముందుకు రాకపోవడమే మంచిది. వస్తే మాత్రం ఎలా వ్యవహరించినా ఆయన భవిష్యత్తుపై అది ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: