వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఒకవైపు తన పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులను చేస్తామని అంటున్నాడు. రాష్ట్రంలో తను ఏర్పాటు చేసే మంత్రి వర్గంలో ఎవరు మంత్రులుగా ఉండబోతున్నారో చెప్పడంతో పాటు కొంతమంది ఎంపీలను కేంద్రం మంత్రివర్గంలో చేరుస్తానని జగన్ మోహన్ రెడ్డి సెలవిస్తున్నారు. అయితే అదెలా సాధ్యం అనే అనుమానం వస్తోంది. జగన్ మోహన్ రెడ్డి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్నిఏ ర్పాటు చేసే అవకాశాలు అయితే లేవు. మరి తన ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవిని ఇప్పించాలి అంటే... ఆయన కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామి కావాలి. కావాలంటే ఏదో ఒక జాతీయ పార్టీకి దగ్గరవ్వాలి. ప్రస్తుతానికి అయితే కేంద్రంలో ఎన్టీయేకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని వివిధ సర్వేలు ఘోషిస్తున్నాయి. అయితే బీజేపీకి సొంతంగా బలం రాదని మాత్రం స్పష్టం అవుతోంది. ఆ పార్టీకి వేరే పార్టీల సహకారం అవసరం ఉంటుంది. అలాంటి జోడు వాయిద్యాల్లో జగన్ మోహన్ రెడ్డి కూడా ఒకరు కావాలి. అప్పుడే జగన్ మోహన్ రెడ్డి తన ఎంపీలను కేంద్రంలో మంత్రులను చేయగలడు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొంది. ఎన్డీయే భాగస్వామి కావడానికి తెలుగుదేశం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ఎన్టీయే కోటలో ఎలా పాగా వేస్తాడు?! అనేది అంతుబట్టడం లేదు. మరి ఎన్నికలు అయ్యాకా జగన్ ఎలా చక్రం తిప్పుతాడోచూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: