ఆర్గురు కలిసి కర్ణుడి చావుకు కారణమయ్యారు అంటుంది భారతం. ఇప్పుడు ముగ్గురు కలిసి ప్రముఖ విద్యాసంస్థల అధిపతి మల్లారెడ్డిని ముంచేస్తున్నారనిపిస్తోంది. . పాపం చంద్రబాబుపై నమ్మకంతో ఎన్నికల్లో కోట్లాదిరూపాయలు ఖర్చుకు అంగీకరించి మల్కాజ్ గిరి టికెట్ తెచ్చుకున్ానడు మల్లారెడ్డి. కానీ చంద్రబాబు తన స్వార్థం కోసం మల్లారెడ్డి వ్యవహారాన్ని గాలికి వదిలేసారు. కారణం చంద్రబాబుకు ఇప్పుడు మల్లారెడ్డి కంటే మోడి, పవన్ కళ్యాణ్ ల అవసరం ఉంది. మోడి, పవన్ కళ్యాణ్ లు మాత్రం జయప్రకాష్ నారాయణ కావాలంటున్నారు. నిన్న మోడి హైదరాబాద్ కు వచ్చిన సంధర్భంగా ఆయనకు స్వాగతం చెప్పేందుకు వెళ్లారు చంద్రబాబు, పవన్, జేపి. చంద్రబాబు ఎదురుగానే జేపికి కరచాలనం చేసిన మోడి మాకు మీలాంటి నేత అవసరం ఉందన్నారు. అంతే కాదు హైదరాబాద్ సభలో బహిరంగంగానే జేపి లాంటి నేత అవసరమన్నారు. అంటే మోడి జేపికి ఓటేయమని చెప్పినట్టే కదా. కాని జేపి ఎవరు. మల్కాజిగిరి నుంచి టిడిపి అభ్యర్థి మల్లారెడ్డికి పోటీగా నిలుచున్న నేత. చంద్రబాబు ఉన్న వేదికపైనే మోడి ఇలా అన్నారంటే బాబు కూడా అందుకు ఒప్పుకున్నట్టే కదా. ఇక పవన్ కళ్యాణ్ అయితే జేపితో సమావేశాలే జరిపారు. తన మద్దతు జేపికే ఉంటుందని చెప్పారు. ఇవన్నీ చూసిన మల్లారెడ్డికి మైండ్ బ్లాంకయి ఉంటుంది. మల్లారెడ్డి మల్కాజిగిరి లోక్ సభ పరిదిలోని అసెంబ్లీ నియోజక వర్గాల్లో టిడిపి అభ్యర్థులందరి ఖర్చు భరిస్తున్నారన్న టాక్ ఉంది. ఆ ఒప్పందం మేరకే ఆయనకు బాబు టికెట్ ఇచ్చారు అంటున్నారు. మళ్లీ మల్లారెడ్డి ఏమనుకుంటారో అని, పవన్ తో బాబు స్టేట్ మెంట్ ఇప్పించారు. తన మద్దతు కూటమి అభ్యర్థి మల్లారెడ్డికే అని. కానీ ప్రకటన వచ్చిన మరుక్షణం జేపి కూడా తన మద్దతు ఎన్టీఎ కూటమికి అన్నారు. అంటే తనను తాను కూటమి అభ్యర్థిగా ఆయనే డిక్లేర్ చేసేసుకున్నారన్నమాట. మోడి, పవన్ లు బహిరంగంగా పలు సార్లు జేపిని మెచ్చుకుని అలాంటి నేత కావాలన్నాకా దాని ప్రభావం ఎలా ఉంటుంది. అంత పెద్ద నేతలకే నచ్చిన నేత జేపి అన్న భావం ప్రజల్లోకి వెళుతుంది కదా. పైగా బిజేపి శ్రేణులు కూడా మల్కాజిగిరిలో ఎవరికోసం పనిచేస్తాయి. అంటే జేపికోసమే అన్నది నిజం. అక్కడ సామాజికవర్గ ఈక్వేషన్లు కూడా వున్నాయి. అంటే చంద్రబాబు, మోడి, పవన్ లు కలసి మల్లారెడ్డిని నిలువునా ముంచారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: